
IND vs AUS: ఫాలో ఆన్ ముప్పును దాటించిన బుమ్రా-ఆకాశ్ దీప్ జోడీ
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో కీలక పరిస్థితుల్లో భారత టెయిలెండర్లు జస్‌ప్రీత్ బుమ్రా (10*) ఆకాశ్ దీప్ (27*) అద్భుత ప్రదర్శన కనబరిచి, 'ఫాలో ఆన్' ముప్పును తప్పించారు.
ప్రధాన బ్యాటర్లు పెవిలియన్ చేరిపోవడంతో భారత జట్టు సంక్షోభంలో పడిన వేళ, ఈ ఇద్దరు సాహసోపేతంగా పోరాడారు.
పదో వికెట్‌కు 39 పరుగులు జోడించి ఆసీస్ బౌలర్లను ఇబ్బందులలో పడేశారు. వెలుతురు లేమి కారణంగా మ్యాచ్ నిలిపేసే సమయానికి భారత్ 9 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది.
ఇంతకుముందు ఆసీస్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు సాధించగా, భారత్ ఇంకా 193 పరుగుల వెనుకంజలో ఉంది.
Details
కీలక ఇన్నింగ్స్ లు కేఎల్ రాహుల్, జడేజా
ముఖ్యంగా 'ఫాలో ఆన్' నుంచి బయటపడటంతో టీమ్‌ఇండియా శిబిరంలో ఉత్సాహం కనిపిస్తోంది.
భారత జట్టులో కేఎల్ రాహుల్ (84) జడేజా (77) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అయితే, టాప్ ఆర్డర్ విఫలమవడంతో భారత జట్టు ఒత్తిడిలో పడింది.
యశస్వి జైస్వాల్ (4), శుభ్‌మన్ గిల్ (1), విరాట్ కోహ్లీ (3), రిషభ్ పంత్ (9), సిరాజ్ (1) లాంటి బ్యాటర్లు తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.
కెప్టెన్ రోహిత్ శర్మ 10 పరుగులు మాత్రమే సాధించగా, నితీశ్‌కుమార్ రెడ్డి 16 పరుగులకే పరిమితమయ్యాడు.
ఆస్ట్రేలియా బౌలర్లలో పాట్ కమిన్స్ (4 వికెట్లు) సత్తా చాటగా, మిచెల్ స్టార్క్ (3), జోష్ హేజిల్‌వుడ్ (1), నాథన్ లైయన్ (1)లు భారత బ్యాటింగ్ లైనప్‌ను కుదేల్ చేశాయి.