Meera Chopra: కుర్రాళ్ల క్రష్ హీరోయిన్ రీఎంట్రీ.. 42వయస్సులో మళ్లీ ఇండస్ట్రీకి.. ఆమె ఎవరంటే?
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ లో 'వాన' సినిమాతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన మీరా చోప్రా, అనంతరం పవన్ కళ్యాణ్ నటించిన 'బంగారం' చిత్రంలో కూడా మెరిసింది. అందం, అభినయంతో ఆకట్టుకున్నప్పటికీ ఆమెకు టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు రాలేదు. 2005లో ఎస్.జె. సూర్య నటించిన తమిళ చిత్రం 'అన్బే ఆరుయిరే' ద్వారా మీరా చోప్రా కథానాయికగా కోలీవుడ్‌లో అడుగుపెట్టింది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన గుర్తుపట్టలేని పాత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఢిల్లీలో చదువుకున్న మీరా, బాలీవుడ్ స్టార్ 'ప్రియాంక చోప్రా'కు బంధువే కావడం విశేషం. ప్రియాంక తొలి చిత్రం కూడా తమిళంలోనే విడుదల కాగా, మీరా కూడా తన సినీ ప్రయాణాన్ని తమిళంతోనే ప్రారంభించింది.
Details
తన
'అన్బే ఆరుయిరే' తర్వాత ఆమె పవన్ కళ్యాణ్ నటించిన 'బంగారం' ద్వారా మళ్లీ తెలుగులో కనిపించింది. తెలుగుతో పోలిస్తే ఆమె తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేసింది. శింబు హీరోగా వచ్చిన 'కాజల్' ఆమె కెరీర్‌లో ల్యాండ్‌మార్క్ చిత్రంగా నిలిచింది. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఆమె నటించింది. చివరిసారిగా 2015లో భరత్ నటించిన 'కిల్లాడి' సినిమాలో కనిపించిన మీరా, ఆ తర్వాత తమిళ చిత్రాల్లో నటించలేదు. ప్రస్తుతం 42 ఏళ్ల వయసులో ఆమె తమిళ చిత్ర పరిశ్రమలోకి రీఎంట్రీ ఇస్తోంది.
Details
నిర్మాతగా ఎంట్రీ
అయితే ఈసారి హీరోయిన్‌గా కాకుండా నిర్మాతగా. విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన 'గాంధీ టాక్స్' చిత్రాన్ని మీరా చోప్రా నిర్మించారు. ఈ సినిమా జనవరి 30న విడుదలైంది. భవిష్యత్తులో ఆమె తిరిగి తమిళ సినిమాల్లో నటించే అవకాశముందని సమాచారం. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే మీరా చోప్రా తాజా ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.