Page Loader
Indonasia Open: అదరగొట్టిన కరుణాకరణ్-ఆద్య జోడీ.. స్టార్ జంటలు తొలి రౌండ్‌లోనే ఔట్!
అదరగొట్టిన కరుణాకరణ్-ఆద్య జోడీ.. స్టార్ జంటలు తొలి రౌండ్‌లోనే ఔట్!

Indonasia Open: అదరగొట్టిన కరుణాకరణ్-ఆద్య జోడీ.. స్టార్ జంటలు తొలి రౌండ్‌లోనే ఔట్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 04, 2025
05:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత షట్లర్లు మెరుపులు మెరిపిస్తున్నారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధుతో పాటు, పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ - చిరాగ్ శెట్టి జంట విజయవంతంగా తమ ప్రదర్శనను కొనసాగిస్తుండగా, మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో సతీశ్ కుమార్ కరుణాకరణ్ - ఆద్యా వరియత్ ద్వయం సత్తా చాటింది. మొదటి రౌండ్‌ మ్యాచ్‌లో విజయం సాధించి రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. అయితే ఇదే విభాగంలో పోటీపడిన ఇతర భారత జట్లు తొలి రౌండ్ నుంచే ఇంటిబాట పట్టాయి.

Details

చైనీస్ తైపీ జంటపై విజయం 

మిక్స్‌డ్ డబుల్స్ మొదటి రౌండ్‌లో సతీశ్ కుమార్ కరుణాకరణ్ - ఆద్యా వరియత్ జోడీకి కఠినమైన పోటీ ఎదురైనప్పటికీ, వారు అద్భుతంగా పోరాడారు. యె హాంగ్ వీ - నికొలె గోంజలెస్ చాన్ (చైనీస్ తైపీ) జంటను మూడు గేముల్లో ఓడించారు. తొలి గేమ్‌ను 15-21తో కోల్పోయినా, ఒత్తిడిని తట్టుకుని మిగిలిన రెండు గేమ్‌లను 21-16, 21-17తో గెలిచి మొత్తం మ్యాచ్‌ను 45 నిమిషాల్లో తమవశం చేసుకున్నారు. ఈ విజయంతో వారు రెండో రౌండ్‌కు అర్హత సాధించారు.

Details

విఫలమైన ఫేవరెట్ జంటలు

కాగా మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత్‌ తరఫున బరిలోకి దిగిన రోహన్ కపూర్ - రుత్దికా శివానీ గడ్డే జంట మాత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. జపాన్‌కు చెందిన యూచీ శిమొగమీ - సయక హొబర ద్వయం చేతిలో 14-21, 9-21తో సూటిగా పరాజయం పాలైంది. అదే విధంగా, అశిత్ సూర్య - అమృత ప్రముతేశ్ జంట కూడా తొలి రౌండ్‌లోనే గెలుపు ఆశలు గల్లంతయ్యాయి. అంతేకాదు, ఫేవరెట్ జంటగా భావించబడిన ధ్రువ్ కపిల్ - తనీషా క్రాస్టో జోడీ కూడా నిరాశ కలిగించింది. మలేషియాకు చెందిన రెండో సీడ్ టాంగ్ జీ చెన్ - ఈ వీ తోహ్ చేతిలో తక్కువ పోటీతోనే పరాజయం చవిచూసింది.

Details

భారత్ జోడికి నిరాశ

వారిద్దరూ పూర్తి ఆధిపత్యంతో మ్యాచ్‌ను ముగించడంతో, భారత్‌ జోడీకి తప్పేమి మిగలలేదు. ఈ ఫలితాలతో మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో భారత్ తరఫున కేవలం కరుణాకరణ్ - ఆద్యా ద్వయం మాత్రమే పోటీలో నిలవగా, మిగతా జట్లు తొలే వెళ్తుండటం నిరాశ కలిగించింది.