LOADING...
IPL 2026 Auction: ఐపీఎల్ వేలం హడావిడి షూరూ.. ఆటగాళ్ల ట్రేడ్ రూల్స్ ఇవే!
ఐపీఎల్ వేలం హడావిడి షూరూ.. ఆటగాళ్ల ట్రేడ్ రూల్స్ ఇవే!

IPL 2026 Auction: ఐపీఎల్ వేలం హడావిడి షూరూ.. ఆటగాళ్ల ట్రేడ్ రూల్స్ ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 12, 2025
05:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌ 2026 మినీ వేలం(IPL 2026 Mini Auction)హడావిడి అధికారికంగా ప్రారంభమైంది. ఈసారి కూడా ఆక్షన్‌ విదేశాల్లోనే జరగనుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అబుదాబిలో డిసెంబర్‌ 15 లేదా 16న వేలం జరిగే అవకాశం ఉంది. 2023లో దుబాయ్‌లో, 2024లో జెడ్డాలో వేలం నిర్వహించగా, ఈసారి మూడోసారి విదేశీ వేదికగా ఐపీఎల్‌ వేలం జరగనుంది. ఇక చర్చల్లో నిలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజు శాంసన్‌ (Sanju Samson) టీమ్‌ మార్పు దాదాపు ఖాయమైంది. రాజస్థాన్‌ అతడిని చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK)కు ట్రేడ్‌ చేస్తోంది. ప్రతిగా రవీంద్ర జడేజా, సామ్‌ కరన్‌లను రాజస్థాన్‌ జట్టు పొందనుందని సమాచారం. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో ఆటగాళ్ల ట్రేడ్‌ రూల్స్‌, ప్రక్రియ ఎలా ఉంటుందో చూద్దాం:

Details

 ట్రేడ్‌ విండో ప్రారంభం

ఒక సీజన్‌ ముగిసిన నెలరోజుల తర్వాత ఐపీఎల్‌ ట్రేడ్‌ విండో ప్రారంభమవుతుంది. ఇది తదుపరి వేలం వారం ముందు వరకు కొనసాగుతుంది. ట్రేడ్‌ ఆప్షన్లు రెండు విధాలుగా జట్లు ఆటగాళ్లను మార్చుకోవచ్చు 1. ప్లేయర్‌ ఫర్‌ క్యాష్‌: ఆటగాడిని ఇచ్చి నగదు పొందడం. 2. ప్లేయర్‌ టు ప్లేయర్‌: ఒక ఆటగాడి బదులు మరొక ఆటగాడిని పొందడం.

Details

ప్రక్రియ ఎలా సాగుతుంది

జట్లు తమకు కావాల్సిన ఆటగాడి కోసం బీసీసీఐకి ఆసక్తి వ్యక్తీకరణ (EOI) పంపాలి. ఆటగాడిని అమ్మే ఫ్రాంచైజీకి ప్రతిస్పందించడానికి 48 గంటల సమయం ఉంటుంది. ఆటగాడు కొత్త జట్టులో చేరేందుకు అంగీకారం తెలిపి, సమ్మతి పత్రంపై సంతకం చేసిన తర్వాతే ట్రేడ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. లాభం పంచుకోవడం కొత్త జట్టు ఆటగాడి ప్రస్తుత ధర కంటే ఎక్కువ చెల్లిస్తే, ఆ అదనపు మొత్తం ప్లేయర్‌, అమ్మే జట్టు మధ్య పంచబడుతుంది.

Details

పరిమితులు లేవు

ఫ్రాంచైజీలు ఎంతమంది ఆటగాళ్లనైనా ట్రేడ్‌ చేసుకోవచ్చు. దీనిపై ఎలాంటి పరిమితి ఉండదు. ఫిట్‌నెస్‌ తప్పనిసరి ట్రేడ్‌ చేసే ఆటగాళ్లు ఫిట్‌గా ఉండి, మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధంగా ఉండాలి. బీసీసీఐ అధికారం ఆటగాళ్ల ట్రేడ్‌లో ఏవైనా అవకతవకలు గమనిస్తే, ఆ ఒప్పందాన్ని రద్దు చేసే హక్కు బీసీసీఐకి ఉంది. ఈసారి సంజు శాంసన్‌-జడేజా-సామ్‌ కరన్‌ ట్రేడ్‌ చర్చలు ఐపీఎల్‌ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.