Page Loader
Vaibhav Arora: కేకేఆర్ జట్టులో మరో కొత్త స్టార్.. ఈడెన్ గార్డన్స్‌లో ఇరగదీశాడు! ఎవరీ వైభవ్ ఆరోరా?
కేకేఆర్ జట్టులో మరో కొత్త స్టార్.. ఈడెన్ గార్డన్స్‌లో ఇరగదీశాడు! ఎవరీ వైభవ్ ఆరోరా?

Vaibhav Arora: కేకేఆర్ జట్టులో మరో కొత్త స్టార్.. ఈడెన్ గార్డన్స్‌లో ఇరగదీశాడు! ఎవరీ వైభవ్ ఆరోరా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 03, 2025
11:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ (IPL) లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తరఫున అద్భుతమైన ప్రదర్శన ఇస్తున్న వైభవ్ అరోరా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచులో 4ఓవర్లలో 3 వికెట్లు పడగొట్టి ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. 1997 డిసెంబర్ 14న హర్యానాలోని అంబాలాలో జన్మించిన వైభవ్ హిమాచల్ ప్రదేశ్ తరఫున దేశీయ క్రికెట్ ఆడుతున్నారు. 2022లో పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టుతో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన అరోరా ఐదు మ్యాచ్‌ల్లో ఆడారు. 2023 నుంచి కేకేఆర్ జట్టులో ఉంటూ ఇప్పటివరకు 18 మ్యాచ్‌లు ఆడి 19 వికెట్లు తీసుకున్నారు. 2024 సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన అరోరా 10 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీశాడు

Details

 దేశీయ క్రికెట్ ప్రయాణం 

వైభవ్ అరోరా 2019లో సౌరాష్ట్రతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్ ద్వారా తన ఫస్ట్-క్లాస్ క్రికెట్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత 2021 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఛత్తీస్‌గఢ్‌పై టి20 అరంగేట్రం చేశారు. దేశీయ క్రికెట్‌లో అద్భుతంగా రాణించిన అరోరా ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించారు. 2022-23 రంజీ ట్రోఫీ సీజన్‌లో హిమాచల్‌ప్రదేశ్‌ తరఫున అత్యధికంగా 25 వికెట్లు తీసి, ఒడిశాపై ఐదు వికెట్ల హాల్‌ను నమోదు చేశారు. కేకేఆర్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు అతడిని ట్రయల్స్‌కు ఆహ్వానించగా, 2021 ఐపీఎల్ మినీ వేలంలో కేకేఆర్ రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది.

Details

ఐపీఎల్ 2025 వేలంలో రికార్డు ధర  

2025 ఐపీఎల్ వేలంలో వైభవ్ అరోరా పై కోల్‌కతా నైట్ రైడర్స్ నమ్మకం ఉంచి రూ. 1.8 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌ల్లో 6 వికెట్లు తీసిన అరోరా, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తో జరిగిన మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్డు, ఇషాన్ కిషన్‌, హెన్రిచ్ క్లాసిన్‌లను అవుట్ చేసి మెరిపించారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పై 1 వికెట్, రాజస్థాన్ రాయల్స్ (RR) పై 2 వికెట్లు తీయడం ద్వారా తన ప్రాభావాన్ని చూపించారు. ప్రస్తుతం వైభవ్ అరోరా కేకేఆర్ జట్టుకు ప్రధాన బలంగా మారనున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.