LOADING...
Harmanpreet Kaur: చివరి క్యాచ్.. జీవితాంతం గుర్తిండిపోతుంది : హర్మన్‌ప్రీత్ కౌర్ 
చివరి క్యాచ్.. జీవితాంతం గుర్తిండిపోతుంది : హర్మన్‌ప్రీత్ కౌర్

Harmanpreet Kaur: చివరి క్యాచ్.. జీవితాంతం గుర్తిండిపోతుంది : హర్మన్‌ప్రీత్ కౌర్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 15, 2025
03:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత జట్టు కెప్టెన్ 'హర్మన్‌ప్రీత్ కౌర్' తన కెరీర్‌లో మొదటి పొందిన సంపాదనను గుర్తుచేసుకొని ఉద్వేగానికి గురయ్యారని తెలిపారు. కెరీర్ ప్రారంభ దశలో స్వీకరించిన రూ.90వేల చెక్ చూసి ప్రపంచంలోనే సంపన్నురాలిని అనిపించిందని, ఆ ఆనందాన్ని పంచుకున్నారు. కౌర్ మాట్లాడుతూ నా కెరీర్ ప్రారంభంలో మాకు టూర్ ఫీజు లక్ష వరకు అందేది, మ్యాచ్‌ల సంఖ్యతో సంబంధం లేకుండా. పన్నులు తీసిన తర్వాత అది సుమారు రూ.90,000 అవుతుంది. ఆ చెక్‌ చూసినప్పుడు, నిజంగా ప్రపంచంలోనే సంపన్నురాలినని అనిపించిందని తెలిపారు.

Details

స్థాయికి మించి ఖర్చు చేశారు

పంజాబ్‌కు చెందిన కౌర్ ఈ తొలి సంపాదన తన తండ్రి 'హర్మందర్ సింగ్'కి సమర్పించారు. అప్పటివరకు తండ్రి స్థానిక కోర్టులో ఒక క్లర్క్‌గా పనిచేస్తుండగా, కౌర్ తన కల కోసం తండ్రి చేసిన త్యాగాన్ని గుర్తుచేసుకున్నారు. అప్పటివరకు నాన్న నా కల కోసం స్థాయికి మించి ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఆ మొత్తం ఆయనకు ఇచ్చినప్పటే నిజమైన విలువ ఉందని ఆమె వెల్లడించారు.

Details

కెరీర్ హైలైట్‌లు 

36 ఏళ్ల హర్మన్‌ప్రీత్ 2009లో వన్డే, టీ20ల్లో అరంగేట్రం చేశారు. 2014లో భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చి, ICC వుమెన్ వన్డే వరల్డ్ కప్ 2025లో ముఖ్య పాత్ర పోషించారు. దక్షిణాఫ్రికాకు 299 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 45.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. చివరి బ్యాటర్ డిక్లెర్క్ బంతిని గాల్లోకి లేపగా, కౌర్ అద్భుతమైన క్యాచ్‌ను పట్టడం భారత అభిమానులను సంతోషంలో ముంచేసింది. కౌర్ ఆ బంతిని తన జేబులో భద్రంగా దాచుకున్నారు. ఆమె పదేపదే ఆ క్షణాన్ని, తన కెరీర్‌లో అత్యంత అపురూపమైన సమయంగా గుర్తుచేస్తున్నారు.

Details

పురుషుతో సమానంగా వేతనమివ్వాలి

ఇంటర్వ్యూలో, ఆ బంతిని కనీసం వేయిసార్లు చూశానని కూడా చెప్పారు. ఆ చివరి క్యాచ్ తర్వాత, ఆమె జీవితంలో ప్రధాన మార్పు సంభవించిందని అన్నారు. "చివరి క్యాచ్ పొందుతున్నప్పుడు నా ఆలోచనలు వ్యక్తపరచడం కష్టం. కానీ ప్రపంచకప్ గెలవాలని కలలు కనడం నిజమైంది. చివరకు మేము సాధించాం. ఇప్పటికి రెండు వారాలు అయ్యాయి, ఆ అనుభూతి ప్రత్యేకంగా ఉందని హర్మన్‌ప్రీత్ వెల్లడించారు. హర్మన్‌ప్రీత్ మహిళా క్రికెటర్లకు పురుషులతో సమానంగా వేతనాలు, గుర్తింపు ఇవ్వాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.