
IND vs UAE: యూఏఈ వేదికలో టీమిండియాకు తొలి మ్యాచ్.. టాస్ గెలిస్తే విజయం ఖాయమా?
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్ 2025లో భారత జట్టు దుబాయ్ మైదానంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో తన ప్రచారాన్ని ఆరంభించనుంది. గతంలో ఇదే మైదానంలో 2025 ఛాంపియన్స్ ట్రోఫీని ఆడిన భారత జట్టు, ఫైనల్లో న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈసారి పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా వాతావరణ మార్పులు మ్యాచ్‌పై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. దీంతో టాస్ నిర్ణయం కీలక పాత్ర పోషించనుందని నిపుణులు చెబుతున్నారు.
Details
టాస్ ప్రభావం స్పష్టమే
ఆసియా కప్ 2025లో టాస్ చాలా ముఖ్యమైంది. యూఏఈలో గత ఏడుమ్యాచ్‌ల రికార్డే దీనికి సాక్ష్యం. ఆ మ్యాచ్‌ల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు ఎల్లప్పుడూ విజయం సాధించింది. వీటిలో 6 మ్యాచ్‌లు యూఏఈ ట్రై సిరీస్‌లో జరిగాయి. తాజాగా ఆసియా కప్ ప్రారంభ పోరులోనూ ఇదే పరిస్థితి కనిపించింది. అఫ్గానిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసి హాంకాంగ్‌పై ఘన విజయం సాధించింది. అంటే టీం ఇండియాకు UAEపై జరిగే మ్యాచ్‌లో గెలుపు సాధించాలంటే టాస్ అదృష్టం కూడా బలంగా తోడవ్వాల్సిందే.
Details
వాతావరణం పెద్ద సవాలు
భారత జట్టు గత ఛాంపియన్స్ ట్రోఫీని ఫిబ్రవరి-మార్చిలో ఆడింది. ఆ సమయంలో UAEలో వాతావరణం చల్లగా ఉండేది. కానీ ఈసారి పరిస్థితి విరుద్ధంగా ఉంది. ప్రస్తుతం అక్కడ పగటి ఉష్ణోగ్రత 41°C, రాత్రి 31°C వరకూ ఉంది. ఈ వేడిమి కారణంగా పిచ్ కూడా భిన్నంగా ప్రవర్తిస్తుంది. మొదట బ్యాటింగ్ చేసే జట్టు సులభంగా పరుగులు రాబడుతుంటే, రెండవ ఇన్నింగ్స్‌లో మాత్రం బ్యాటింగ్ కష్టమవుతుంది. బంతి బ్యాట్‌పై సాఫీగా రాకపోవడం వల్ల రన్స్ చేయడం క్లిష్టమవుతుంది.
Details
గెలుపు రికార్డు స్పష్టమైంది
ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 9 వరకు UAEలో జరిగిన 7 టీ20 మ్యాచ్‌లన్నింటిలోనూ టాస్ గెలిచిన జట్టే మొదట బ్యాటింగ్ చేసి విజయం సాధించింది. ఇది గణాంకాల రూపంలోనూ టీం ఇండియాకు హెచ్చరికే. ఆటగాళ్ల ఫిట్‌నెస్ కూడా కీలకం కఠిన వాతావరణంలో ఆడటం ఆటగాళ్లకు మరో సవాలే. తీవ్ర వేడిలో పరుగులు తీయడం, ఫీల్డింగ్ చేయడం ఆటగాళ్ల స్టామినాకు పరీక్షగా మారనుంది. అందువల్ల భారత్ వర్సెస్ యూఏఈ పోరులో టాస్ మాత్రమే కాకుండా ఆటగాళ్ల ఫిట్‌నెస్ కూడా కీలక పాత్ర పోషించనుంది.