యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్‌పైనే ఒత్తిడి ఎక్కువ : స్కాట్ బోలాండ్
ఈ వార్తాకథనం ఏంటి
యాషెస్ సిరీస్ 2023 జూన్ 16 నుంచి ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా వర్సస్ ఇంగ్లాండ్ ఈ సిరీస్ లో అమీతుమీ తేల్చుకోనున్నాయి.
యాషెస్ సిరీస్ దగ్గరపడుతున్న వేళ కొందరు మాజీ ఆటగాళ్లు సిరీస్ గురించి భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఈ సిరీస్‌కు ఇంగ్లాండ్ అతిథ్యమివ్వనుంది. బెన్ స్టోక్స్ నాయకత్వంలో ఇంగ్లాండ్ బరిలోకి దిగనుంది. ఆసీస్ చివరిసారిగా 2001లో ఇంగ్లాండ్‌లో సిరీస్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే.
యాషెస్ సిరీస్ గురించి ఆస్ట్రేలియా పేసర్ స్కాట్ బోలాండ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా కన్నా ఇంగ్లాండ్ పైనే ఈసారి ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చాడు.
Details
బాజ్ బాల్ విధానంతో టెస్టుల్లో దూకుడును పెంచిన ఇంగ్లాండ్
ఇంగ్లాండ్ హెడ్ కోచ్ గా బ్రెండన్ మెకల్లమ్ పదవీ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి, ఇంగ్లాండ్ 'బాజ్ బాల్' విధానంతో వరుసగా విజయాలను సాధించింది. టెస్టులో వేగంగా ఆడుతూ భారీ విజయాలను నమోదు చేస్తోంది.
ఇంగ్లాండ్ దూకుడుగా ఆడటానికి ప్రయత్నిస్తుందని, దీని వల్ల తమపై ఉన్న ఒత్తిడి కన్నా వారిపైనే ఎక్కువగా ఉంటుందన్నారు. వికెట్ ఫ్లాట్‌గా ఉండే స్కోరింగ్ వేగం తగ్గుతుందని, ఆ తర్వాత వికెట్లు తీయడం ఈజీ అని స్కాట్ బోలాండ్ పేర్కొన్నారు.
ప్రస్తుతం పాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ తో తలపడనుంది. గాయం కారణంగా దూరమైన ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్, తిరిగి యాషెస్ సిరీస్ లో పాల్గొనే అవకాశం ఉంది.