LOADING...
సింధు టాలెంట్‌కు అసలు పరీక్ష.. నేటి నుంచి సింగపూర్ ఓపెన్ టోర్నీ
అకానె యామగుచితో పోటీపడనున్న పీవీ.సింధు

సింధు టాలెంట్‌కు అసలు పరీక్ష.. నేటి నుంచి సింగపూర్ ఓపెన్ టోర్నీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 06, 2023
12:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ -750 టోర్నీ సాధించాలంటే భారత స్టార్ షట్లర్ పీవీ. సింధు శ్రమించాల్సి ఉంటుంది. నేటి నుంచి ఈ మెగా టోర్నీ మొదలు కానుంది. తొలి రౌండ్ లోనే సింధుకు కఠిన ప్రత్యర్థి ఎదురుకానుంది. ప్రపంచ నంబర్ వన్, టాప్ సీడ్ అకానె యామగుచి (జపాన్) తో సింధు తలపడనుంది. వీరిద్దరూ చివరిసారిగా గతేడాది థాయలాండ్ ఓపెన్ లో పోటీపడ్డారు. ఆ పోటీలో మొదటి రౌండ్‌లోనే పీవీ సింధు నిష్క్రమించింది. జూన్ 6 నుంచి 11 వరకు జరగనున్న ఈ టోర్నీలో పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్ పాల్గొంటున్నారు.

Details

రచనోక్ తో పోటీ పడనున్న సైనా నెహ్వాల్

భారత్ కు చెందిన మరో స్టార్ సైనా నెహ్వాల్ తొలి రౌండ్‌లో ప్రపంచ మాజీ ఛాంపియన్ రచనోక్ (థాయ్‌లాండ్) తో తలపడనుంది. ఇక పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచులో కిదాంబి శ్రీకాంత్, వాంగ్‌చరోన్(థాయ్‌లాండ్)తో పోటీ పడనున్నారు. కొడాయ్‌ నరోకా (జపాన్‌)తో ప్రణయ్‌, సునెయామ (జపాన్‌)తో ప్రియాన్షు రజావత్‌, చౌ తియెన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ)తో లక్ష్య సేన్‌ ఆడనున్నారు. ఈ పోటీల్లో ఎవరు ఏ మేరకు రాణిస్తారో వేచి చూడాలి.