Page Loader
Swiss Open: ఫ్రీ-క్వార్టర్ ఫైనల్లోకి పీవీ సింధు, ప్రణయ్
క్వార్టర్ ఫైనల్ కి దూసుకెళ్లిన పీవీ సింధు, ప్రణయ్

Swiss Open: ఫ్రీ-క్వార్టర్ ఫైనల్లోకి పీవీ సింధు, ప్రణయ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 23, 2023
05:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత స్టార్ షట్లర్స్ పీవీ సింధు, హెచ్ ఎస్ ప్రణయ్ స్వీస్ ఓపెన్స్ లో సత్తా చాటారు. స్వీస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఫ్రీ-క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. త‌ర్వాతి రౌండ్‌లో ఈ ఒలింపిక్ విజేత‌ పీవీ సింధు ఇండోనేషియాకు చెందిన పుత్రి కుసుమ వ‌ర్దానీతో సింధు త‌ల‌ప‌డ‌నుంది. పోయిన ఏడాది ఈ టోర్నమెంట్ ఛాంపియన్ గా నిలిచిన సింధు 21-9 21-16 తో జెంజిరా స్టాడెల్మన్‌ (స్విట్జ‌ర్‌లాండ్)ను చిత్తు చేసింది. హెచ్‌ఎస్ ప్రణయ్ ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్స్ ఫైనలిస్ట్ చైనాకు చెందిన షి యు క్విని ఓడించి పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్‌ఫైనల్‌లోకి అడుగుపెట్టాడు.

ప్రణయ్

క్రిస్టో పొపోవ్ తలపడనున్న ప్రణయ్

ప్రపంచ 9వ ర్యాంకర్ ప్రణయ్, పురుషుల సింగిల్స్‌లో 2018 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజత పతక విజేత అయిన షి యు క్విపై 21-17, 19-21, 21-17 తేడాతో విజయం సాధించాడు. ప్ర‌ణ‌య్ త‌ర్వాతి రౌండ్‌లో క్రిస్టో పొపోవ్ (ఫ్రాన్స్‌)ను ఢీ కొట్ట‌నున్నాడు కిదాంబి శ్రీకాంత్ హాంకాంగ్‌కు చెందిన లీ చెయుక్ యియుతో గురువారం తలపడనున్నాడు. జాతీయ ఛాంపియన్ మిథున్ మంజునాథ్, చైనీస్ తైపీకి చెందిన చియా హవో లీతో తలపడగా, పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్, చిరాగ్ శెట్టి తైవాన్‌కు చెందిన ఫాంగ్-చిహ్ లీ, ఫాంగ్-జెన్ లీతో పోటీ పడనున్నాడు.