
Ind vs Aus 2nd ODI: భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడాలి?
ఈ వార్తాకథనం ఏంటి
పెర్త్‌లో ఘోర పరాజయం తర్వాత, భారత జట్టు ఇప్పుడు సిరీస్ రక్షణ కోసం కీలక సవాలు ఎదుర్కొంటోంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో రెండో మ్యాచ్ అక్టోబర్ 23న, గురువారం, అడిలైడ్ ఓవల్‌లో జరుగుతుంది. సిరీస్‌లో నిలవాలంటే భారత జట్టు ఈ రెండో వన్డేను తప్పకుండా గెలవాలి. తొలి వన్డేలో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో భారత్ బ్యాటింగ్ విఫలమైంది. మూడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0తో ఆధిక్యంలో ఉంది. సిరీస్ కైవసం చేసుకోవడానికి భారత జట్టు రెండో వన్డేలో గెలవడం తప్పనిసరి. ఈ విజయానికి ముఖ్య పాత్రలు టాప్-ఆర్డర్ బ్యాట్స్‌మెన్ నిర్వహించాలి.
Details
వర్షం కారణంగా మ్యాచ్ కు ఆటకం
పెర్త్‌లో తొలి వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కేవలం 25పరుగులకే ఔటయ్యారు. వర్షం కారణంగా ఆటకు ఆటంకం ఏర్పడింది, భారత్ భారీ స్కోరు సాధించలేకపోయింది. ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం జరిగిందని చెప్పవచ్చు. ఇప్పుడు జట్టు విజయాల పథంలో తిరిగి అడుగుపెట్టాలంటే, అత్యుత్తమ బ్యాటింగ్ ప్రదర్శన చేయడం అత్యవసరం. రెండో వన్డే భారత కాలమానం ప్రకారం ఉదయం 9:00గంటలకు ప్రారంభం అవుతుంది. టాస్ అరగంట ముందుగా, ఉదయం 8:30 గంటలకు జరుగుతుంది. అడిలైడ్ ఓవల్ మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. వన్డే సిరీస్ ప్రసార హక్కులు స్టార్ స్పోర్ట్స్‌కు ఉన్నాయి. ప్రత్యక్ష ప్రసారం ద్వారా మ్యాచ్‌ను వీక్షించవచ్చు. అదనంగా, డీడీ స్పోర్ట్స్‌లో ఉచిత ప్రసారం అందుబాటులో ఉంటుంది.