3rd Umpire Stuck In Lift!:ఇదేం కర్మరా బాబు.. లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన అంపైర్.. ఆగిపోయిన మ్యాచ్!
ఈ వార్తాకథనం ఏంటి
మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే రెండో టెస్టు మ్యాచులో ఊహించని ఘటన ఎదురు కావడంతో మ్యాచ్ నిలిచిపోయింది.
ఇప్పటికే రెండుసార్లు వివిధ కారాణాల వద్ద మ్యాచుకు అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే.
తొలి రోజు వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడగా, ఆ తర్వాత పావురాల వల్ల మ్యాచును కాసేపు నిలిపివేశారు.
ఇవాళ మూడో రోజు ఆటలో థర్డ్ అంపైర్ లిఫ్ట్ లో ఇరుక్కుపోయాడని కొన్ని నిమిషాల పాటు ఆటను నిలిపివేశారు.
థర్డ్ అంపైర్ జోయల్ విల్సన్ భోజనానికి వెళ్లి వస్తుండగా లిఫ్ట్ ఇరుక్కుపోయాడు.
దీంతో మ్యాచు కాసేపు అగిపోయింది.
Deatails
ఆధిక్యం దిశగా ఆస్ట్రేలియా
వెంటనే స్పందించిన సిబ్బంది లిఫ్ట్ సరిచేసి జోయల్ విల్సన్ ను బయటికి తీసుకొచ్చారు.
నవ్వుతూ థర్డ్ అంపైర్ లిప్ట్ లో నుంచి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మ్యాచ్ విషయానికొస్తే.. మూడో రోజు ఆటలో ఆస్ట్రేలియా 96 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. దీంతో ఆసీస్ 150 ఆధిక్యంలో నిలిచింది.మొదట పాకిస్థాన్ 264 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.