LOADING...
Asia Cup 2025: ఆసియా కప్‌ 2025 విజేత టీమిండియాకు భారీ నజరానా
ఆసియా కప్‌ 2025 విజేత టీమిండియాకు భారీ నజరానా

Asia Cup 2025: ఆసియా కప్‌ 2025 విజేత టీమిండియాకు భారీ నజరానా

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 29, 2025
09:53 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆదివారం దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆసియా కప్‌ 2025 ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. ఇందులో భారత్‌, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. పాకిస్థాన్ ఇన్నింగ్స్‌లో కేవలం 20 పరుగులకే మూడు వికెట్లు పడగొట్టడంతో, ఆసియా కప్‌ సొంతం చేసుకునే అవకాశం ఉండనని భావించుకున్న పాకిస్థాన్‌కు తెలుగు ఆటగాడు తిలక్‌ వర్మ (69 నాటౌట్‌) షాక్ ఇచ్చాడు. చివరి వరకు క్రీజులో నిలిచిన తిలక్‌ తన కెరీర్‌లో చిరస్మరణీయ ఇనింగ్స్ ఆడుతూ భారత్‌ను విజయానికి నడిపాడు. అతడికి శివమ్‌ దూబె (33) మరియు సంజూ శాంసన్‌ (24) సహకరించడంతో భారత్ ట్రోఫీని కైవసం చేసుకుంది.

Details

బీసీసీఐ భారీ నజరానా

టీమిండియా ఆసియా కప్‌ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవడంపై భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) సంతోషాన్ని వ్యక్తం చేసింది. టోర్నీ మొత్తంలో అద్భుతమైన ఆట ప్రదర్శించిన జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. ఆసియా కప్‌ విజేతగా నిలిచిన టీమ్‌ఇండియాకు బీసీసీఐ రూ.21 కోట్లను నజరానాగా అందించనుంది, ఇది ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బందికి కూడా పంచబడుతుంది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. అంతే కాకుండా, 2025 ఆసియా కప్‌ విజేత భారత్‌కు ఆసియా క్రికెట్ కౌన్సిల్‌ (ఏసీసీ) రూ.2.65 కోట్లను ప్రైజ్‌మనీగా అందించింది.

Details

దేశవ్యాప్తంగా సర్వత్రా ప్రశంసలు

రన్నరప్‌ పాకిస్థాన్‌కు రూ.66.75 లక్షలు ప్రైజ్‌మనీగా దక్కాయి. గత ఆసియా కప్‌తో పోలిస్తే ఈసారి విజేతకు అదనంగా 50,000 డాలర్లు లభించాయి. విజేతగా నిలిచిన టీమ్‌ఇండియాపై దేశవ్యాప్తంగా సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఫాన్స్ శుభాకాంక్షలు తెలిపారు, మరియు '#CongratsTeamIndia' అనే హ్యాష్‌ట్యాగ్ ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.