manjot Kaur: అప్పుడు కపిల్ దేవ్.. ఇప్పుడు అమన్‌జ్యోత్.. చరిత్రను తిరగరాసిన క్యాచ్
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణాఫ్రికా విజయానికి ఇంకా 54 బంతుల్లో 79 పరుగులు అవసరమయ్యాయి. అయితే ఆ జట్టులో ఎలాంటి ఆందోళన కనిపించలేదు. కారణం కెప్టెన్ లారా వోల్వార్ట్ ఇంకా క్రీజులో ఉండడమే. సెంచరీతో దూసుకెళ్తున్న ఆమెపై ప్రొటీస్ జట్టు ఆశలు నిలిచాయి. ఈ స్థితిలో 42వ ఓవర్లో దీప్తి శర్మ బౌలింగ్ చేస్తుండగా, వోల్వార్ట్ భారీ షాట్‌కు ప్రయత్నించింది. బంతి గాల్లోకి ఎగసి డీప్ మిడ్ వికెట్ వైపు దూసుకెళ్లింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న అమన్‌జ్యోత్ బంతిని పట్టుకునేందుకు దూసుకొచ్చింది. మొదట క్యాచ్‌ను పట్టినట్టే అనిపించింది,
Details
అమన్ జ్యోతి క్యాచ్ తో విజయానికి మార్గం సుగమం
కానీ బంతి చేతిలోంచి జారిపోయింది. వెంటనే తేరుకుని రెండో ప్రయత్నం చేసింది ఈసారి కూడా సాధ్యపడలేదు. అయితే ఆమె ధైర్యం కోల్పోలేదు. మూడో ప్రయత్నంలో మాత్రం బంతిని సురక్షితంగా పట్టుకుని కీలకమైన వోల్వార్ట్ వికెట్‌ను తీయగలిగింది. ఆ క్యాచ్‌తో మ్యాచ్ మలుపు తిప్పబడింది. 1983 ప్రపంచకప్‌లో వివ్ రిచర్డ్స్ క్యాచ్‌ను కపిల్ దేవ్ పట్టిన క్షణం మాదిరిగానే, అమన్‌జ్యోత్ ఈ క్యాచ్ కూడా భారత విజయానికి మార్గం సుగమం చేసింది.