
Legendary Players: 40 ఏళ్లు దాటినా ఆటలో అదరగొడుతున్న లెజెండరీ ప్లేయర్స్ వీరే!
ఈ వార్తాకథనం ఏంటి
శారీరక శ్రమ ఎక్కువగా ఉండే క్రీడల్లో, 40 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆటగాళ్లు రిటైర్మెంట్ వైపు మళ్లిపోతారు. చాలామంది 30ల మధ్యలోనే "ఇక చాలు" అని మైదానానికి వీడ్కోలు చెబుతారు. అయితే కొందరు మాత్రం వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని నిరూపిస్తూ, 40ల్లోనూ యువ ఆటగాళ్లకు పోటీగా దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం అలా తమ ప్రతిభను చాటుకుంటున్న స్టార్ ప్లేయర్లను చూద్దాం.
Details
క్రిస్టియానో రొనాల్డో - అలుపెరుగని ఫుట్‌బాల్ యోధుడు
ఫుట్‌బాల్‌లో 90 నిమిషాల పాటు పరుగులు తీయాలంటే అమోఘమైన ఫిట్‌నెస్ అవసరం. 30 దాటితే ఆటగాళ్ల వేగం తగ్గిపోతుంది. కానీ 40 ఏళ్లు వచ్చినా రొనాల్డో మాత్రం ఇంకా అదే ఉత్సాహంతో పోర్చుగల్ జట్టు, అల్ నాసర్ క్లబ్ తరఫున ఆడుతున్నాడు. కీలక గోల్స్ సాధించి, జట్టును గెలిపించడంలో ముందుంటున్నాడు. తాజాగా అల్ నాసర్ తరఫున హ్యాట్రిక్ చేయడం అతడి ఫిట్‌నెస్‌కు నిదర్శనం. తనయుడు ఏంజెల్ సాంటోస్ పోర్చుగల్ జూనియర్ జట్టులో చోటు సంపాదించినా, రొనాల్డో ఇంకా అంతర్జాతీయ టోర్నీల్లో మెరిసే విషయం విశేషం. ఏడాదికి సుమారు రూ. 2,000 కోట్ల ఆదాయం పొందుతూ, అత్యధికంగా సంపాదించే అథ్లెట్‌గా కొనసాగుతున్నాడు.
Details
లెబ్రాన్ జేమ్స్ - ఎన్‌బీఏలో ఆల్‌టైం గ్రేట్
బాస్కెట్‌బాల్‌లో 40 ఏళ్ల వయసులోనూ రాణించడం అరుదే. కానీ లెబ్రాన్ జేమ్స్ మాత్రం 1,562 మ్యాచ్‌లలో 42,184 పాయింట్లు సాధించి, లీగ్ చరిత్రలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెరీర్ సగటు 27 పాయింట్లు కాగా, ఈ ఏడాదీ 24.4 సగటుతో యువ ఆటగాళ్లకు సవాల్ విసురుతున్నాడు. గతేడాది పారిస్ ఒలింపిక్స్‌లో ఆడిన లెబ్రాన్, కొత్త సీజన్ కోసం లాస్ ఏంజెలెస్ లేకర్స్‌తో రూ. 460 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు.
Details
లూయిస్ హామిల్టన్ - ట్రాక్‌పై నాన్‌స్టాప్ రేసర్
ఫార్ములావన్ రేసింగ్‌లో దీర్ఘకాలం పోటీగా ఉండటం కష్టం. కానీ 40 ఏళ్ల లూయిస్ హామిల్టన్ ఇంకా అదే ఉత్సాహంతో రేసుల్లో పాల్గొంటున్నాడు. ఫెరారీ తరఫున ఆస్ట్రియన్, బ్రిటన్ గ్రాండ్‌ప్రిల్లో నాలుగో స్థానంలో నిలిచి, పోడియంపై నిలిచే అవకాశాన్ని కొద్దిలో కోల్పోయాడు. 2008లో తొలి ఛాంపియన్‌షిప్ గెలిచిన అతను, 2020లో చివరిసారి టైటిల్ సాధించాడు. ట్రాక్‌పై రెండు సార్లు ప్రమాదాల్లో చిక్కుకున్నా, రేసింగ్‌ను ఆపలేదు.
Details
వీనస్ విలియమ్స్ - టెన్నిస్‌లో అలుపెరుగని తార
టెన్నిస్‌లో మహిళా ఆటగాళ్లు 30ల మధ్యలోనే రిటైరవడం సాధారణం. కానీ 45 ఏళ్ల వీనస్ విలియమ్స్ ఇంకా ప్రొఫెషనల్ టెన్నిస్ ఆడుతోంది. చెల్లెలు సెరెనా రిటైర్ అయినా, వీనస్ మాత్రం ఈ ఏడాది యుఎస్ ఓపెన్‌లో మిక్స్‌డ్ డబుల్స్‌కు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బరిలో దిగింది. మహేంద్రసింగ్ ధోని - ఐపీఎల్‌లో మన మహి 44 ఏళ్ల ధోని, అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై ఆరేళ్లు గడిచినా, ఐపీఎల్‌లో మాత్రం కొనసాగుతున్నాడు. ఒకప్పటి స్థాయి బ్యాటింగ్ లేకపోయినా, విలువైన ఇన్నింగ్స్ ఆడుతూ, వికెట్‌కీపింగ్‌లో చురుకుదనం చూపిస్తూ, అవసరమైతే కెప్టెన్సీ బాధ్యతలు కూడా తీసుకుంటున్నాడు.
Details
ఫాఫ్ డుప్లెసిస్ - ఎప్పటికీ యంగ్ ఓపెనర్
41 ఏళ్ల డుప్లెసిస్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినా, ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌లలో అదరగొడుతున్నాడు. విధ్వంసక ఇన్నింగ్స్, డైవింగ్ క్యాచ్‌లతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇటీవల మేజర్ క్రికెట్ లీగ్‌లో రెండు శతకాలు బాదాడు. మహ్మద్ నబి - అఫ్గానిస్థాన్ క్రికెట్‌కు చిరునామా 40 ఏళ్ల నబి, అఫ్గానిస్థాన్ జట్టు అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చినప్పటి నుంచి నిరంతరంగా ఆడుతున్నాడు. తనయుడు హసన్ ఐసాఖిల్ దేశవాళీ టీ20 లీగ్స్‌లో ప్రత్యర్థిగా ఆడినా, నబి ఇంకా ఫామ్‌లోనే కొనసాగుతున్నాడు.