Page Loader
హైదరాబాద్‌లో జరిగే వరల్డ్ కప్ మ్యాచుల లిస్ట్ ఇవే!
రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ స్టేడియం

హైదరాబాద్‌లో జరిగే వరల్డ్ కప్ మ్యాచుల లిస్ట్ ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 27, 2023
06:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచుతో ఈ టోర్నీ ప్రారంభం కానుంది. నవంబర్ 12న పూణేలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మధ్య జరిగే ఆఖరి గ్రూప్ మ్యాచులతో లీగ్ స్టేజ్ ముగియనుంది. వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా హైదరాబాదులోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో పలు మ్యాచులు జరగనున్నాయి. అయితే అందులో ఒక్కటి కూడా టీమిండియా మ్యాచ్ లేకపోవడంతో తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. అయితే పాకిస్థాన్ లాంటి జట్టు ఉప్పల్ స్టేడియంలో రెండు మ్యాచులు ఆడుతుండడం గమనార్హం. పాకిస్థాన్ జట్టు లీగ్ స్టేజ్ లో భాగంగా క్వాలిఫయర్ జట్లతో రెండు మ్యాచులనూ హైదరాబాద్ లో ఆడనుంది.

Details

అక్టోబర్ 15న టీమిండియా-పాకిస్థాన్ మధ్య మ్యాచ్

హైదరాబాద్‌లో జరిగే వరల్డ్ కప్ మ్యాచ్‌లు అక్టోబర్ 6 - పాకిస్థాన్ vs క్వాలిఫయర్ 1 అక్టోబర్ 9 - న్యూజిలాండ్ vs క్వాలిఫయర్ 1 అక్టోబర్ 12 - పాకిస్థాన్ vs క్వాలిఫయర్ 2 ఇక ఆక్టోబర్ 15న నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది. టీమిండియా తన మ్యాచులను అహ్మదాబాద్, ధర్మశాల, ఢిల్లీ, చెన్నై, లక్నో, పుణె, బెంగళూరు, ముంబై, కోల్‌కతాలలో ఆడనుంది.