LOADING...
IPL: 50 పరుగుల లోపే 3 వికెట్లు.. అయినా 200+ టార్గెట్ ఛేదించిన జట్లు ఇవే!
50 పరుగుల లోపే 3 వికెట్లు.. అయినా 200+ టార్గెట్ ఛేదించిన జట్లు ఇవే!

IPL: 50 పరుగుల లోపే 3 వికెట్లు.. అయినా 200+ టార్గెట్ ఛేదించిన జట్లు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 12, 2026
03:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌లో ధర్మశాల వేదికగా జరిగిన హైస్కోరింగ్ థ్రిల్లర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ మరో ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. దీంతో ధర్మశాల మైదానంలో టీ20 ఫార్మాట్‌లో నమోదైన అత్యధిక విజయవంతమైన చేజ్‌గా ఇది రికార్డుల్లో నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఆరంభంలోనే తీవ్ర ఒత్తిడిలో పడింది. తొలి ఐదు ఓవర్లలోనే టాప్-3 బ్యాటర్లు ఔట్ కావడంతో జట్టు స్కోరు 33/3గా మారింది.

వివరాలు

హాఫ్ సెంచరీతో రాణించిన అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్

అనంతరం మరో వికెట్ కోల్పోయి 74/4తో కష్టాల్లో చిక్కుకుంది. అయితే కెప్టెన్ అక్షర్ పటేల్ (56), డేవిడ్ మిల్లర్ (51) అర్ధసెంచరీలతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. చివర్లో అశుతోష్ శర్మ 10 బంతుల్లో 24 పరుగులు, మాధవ్ తివారీ 8 బంతుల్లో 18 నాటౌట్, అకీబ్ నబీ దార్ 2 బంతుల్లో 10 పరుగులతో రాణించడంతో ఢిల్లీ చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది.

వివరాలు

అసాధ్యాన్ని సాధ్యం చేసిన జట్ల జాబితా

ఐపీఎల్ చరిత్రలో 50 పరుగుల లోపే మూడు వికెట్లు కోల్పోయి కూడా 200కుపైగా లక్ష్యాన్ని ఛేదించిన సందర్భాలు చాలా అరుదుగా నమోదయ్యాయి. ఢిల్లీ క్యాపిటల్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ - 2025 లక్నో సూపర్ జెయింట్స్‌పై 2025 ఐపీఎల్ సీజన్‌లో జరిగిన మ్యాచ్‌లో కూడా ఢిల్లీ అద్భుత పోరాటం చేసింది. 210 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ 7 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి, తర్వాత 65/5తో తీవ్ర ఒత్తిడిలో పడింది. అయితే అశుతోష్ శర్మ అజేయంగా 66 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. అలాగే విప్రజ్ నిగమ్ 15 బంతుల్లో 39 పరుగులు, ట్రిస్టన్ స్టబ్స్ 22 బంతుల్లో 34 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుని గెలిపించారు.

Advertisement

వివరాలు

లక్నో సూపర్ జెయింట్స్ vs ఆర్సీబీ - 2023

2023 ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్‌పై లక్నో సూపర్ జెయింట్స్ 213 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఆ మ్యాచ్‌లో లక్నో 23 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే మార్క్ స్టోయినిస్ 30 బంతుల్లో 65 పరుగులతో జట్టుకు బలమైన పునాది వేశాడు. అనంతరం నికోలస్ పూరన్ కేవలం 19 బంతుల్లో 62 పరుగులతో విధ్వంసం సృష్టించి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. చివరి బంతికి లక్నో ఒక వికెట్ తేడాతో గెలిచింది.

Advertisement