Page Loader
ODI World Cup 2023 : ఒకే ఎడిషన్ వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్ ఫైవ్ ప్లేయర్లు వీరే!
ఒకే ఎడిషన్ వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్ ఫైవ్ ప్లేయర్లు వీరే!

ODI World Cup 2023 : ఒకే ఎడిషన్ వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్ ఫైవ్ ప్లేయర్లు వీరే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 04, 2023
12:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే వరల్డ్ కప్ 2023 మెగా టోర్నీ మరో 24 గంటల్లో భారత్‌లోని అహ్మదాబాద్ నరేంద్ర స్టేడియం వేదికగా ప్రారంభం కానుంది. ఈ టోర్నీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తమ అభిమాన బ్యాటర్లు సెంచరీల మోత మోగించాలని ఫ్యాన్స్ అశిస్తున్నారు. ఇప్పటివరకూ జరిగిన 13 వరల్డ్ కప్ టోర్నీల్లో ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన 2023 ప్రపంచ కప్ టోర్నీలో సచిన్ టెండూల్కర్ 61 సగటుతో మొత్తం 673 పరుగులు చేశాడు. దీంతో ఒకే ఎడిషన్ వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో నిలిచాడు.

Details

అగ్రస్థానంలో సచిన్ టెండూల్కర్

2007 ప్రపంచ కప్‌లో వెస్టిండీస్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడన్ 659 పరుగులను సాధించాడు. దీంతో సచిన్ తర్వాత ఒకే ఎడిషన్ వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఈ టోర్నీలో మాథ్యూ హేడన్ 77 సగటుతో పాటు 3 సెంచరీలను సాధించాడు. ఈ మెగా టోర్నీ ఆసీస్ జట్టు ప్రపంచ కప్ టైటిల్‌ను ఎగరేసుకొనిపోయింది. ఇక ఇంగ్లండ్ వేదికగా జరిగిన 2019 వరల్డ్ కప్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పరుగుల వరద పారించాడు. ఆడిన 9 మ్యాచుల్లో 81 సగటుతో 648 పరుగులను చేశాడు.

Details

మూడో స్థానంలో హిట్ మ్యాన్

ఇందులో 5 సెంచరీలను బాదడం విశేషం. అయితే న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచులో హిట్ మ్యాన్ విఫలం కావడంతో భారత్ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇంగ్లండ్ వేదికగా జరిగిన 2019 వరల్డ్ కప్ లోనే డేవిడ్ వార్నర్ 71 సగటుతో 647 పరుగులను చేశాడు. దీంతో ఒకే ఎడిషన్ వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ టోర్నీలో వార్నర్ 3 సెంచరీలను కూడా బాదాడు. ఇదే ఎడిషన్ లోనే బంగ్లాదేశ్ కెప్టెన్ 86 సగటుతో 606 పరుగులను సాధించాడు. ఈ ఎడిషన్ సెంచరీలను బాదాడు. ఇక ఈ లిస్టులో అతను ఐదో స్థానంలో నిలిచాడు.