Amanjot Kaur: గుండె పగిలే వార్తను దాచారు.. కట్ చేస్తే ఛాంపియన్‌గా తిరిగి వచ్చిన అమన్‌జోత్!
ఈ వార్తాకథనం ఏంటి
భారత మహిళల వన్డే ప్రపంచకప్ విజయానికి వెనుక కేవలం ఆటగాళ్ల ప్రతిభ, పట్టుదల మాత్రమే కాదు. వారి కుటుంబాల అపార త్యాగం, మద్దతు కూడా దాగి ఉంది. ఈ చారిత్రాత్మక గెలుపు తరువాత బయటకు వచ్చిన ఒక హృదయవిదారక కథ దేశాన్ని కదిలించింది. టీమ్ ఆల్‌రౌండర్, ప్రపంచకప్ హీరోగా నిలిచిన అమన్‌జోత్ కౌర్ (Amanjot Kaur) కుటుంబం ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది. ప్రపంచకప్ జరుగుతున్న సమయంలో అమన్‌జోత్ కౌర్ అమ్మమ్మకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
Details
తెలియకుండా గోప్యంగా ఉంచాం
ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఈ వార్తను అమన్‌జోత్‌కు తెలియకుండా గోప్యంగా ఉంచాలని నిర్ణయించారు. ఎందుకంటే, మ్యాచ్‌ల ఒత్తిడిలో ఈ సమాచారం ఆమె మానసిక స్థితిని దెబ్బతీయవచ్చని భావించారు. అమన్‌జోత్ తండ్రి భూపిందర్ సింగ్ మాట్లాడుతూ, "మా అమ్మకు గుండెపోటు వచ్చినప్పటికీ, అమన్‌జోత్ దృష్టి ఆటపై నుంచే ఉండాలని మేము నిర్ణయించుకున్నాం. ఆమె దేశానికి ప్రపంచకప్ తెచ్చే లక్ష్యంతో ఉంది. కుటుంబ సమస్యలతో ఆమె మనసు మళ్లకూడదని ఈ విషయాన్ని చెప్పలేదని వివరించారు. కుటుంబం చేసిన ఈ త్యాగం వెనుక ప్రేమ, బాధ్యత రెండూ ఉన్నాయి. ఫైనల్ మ్యాచ్‌లో అమన్‌జోత్ అసాధారణమైన ప్రదర్శన కనబరిచింది. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ ఆమె అద్భుతంగా రాణించింది.
Details
అమ్మమ్మ ఆరోగ్యం బాగాలేక ఇంట్లో అందరూ ఉన్నారు
ముఖ్యంగా సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ సెంచరీ దిశగా దూసుకెళ్తుండగా, దీప్తి శర్మ బౌలింగ్‌లో వచ్చిన కీలక క్యాచ్‌ను అమన్‌జోత్ చాకచక్యంగా పట్టుకుంది. అదే క్షణం మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మార్చేసింది. కుటుంబ బాధను మనసులో పెట్టుకుని ఆ స్థాయి ఏకాగ్రతతో ఆడడం ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు. విజయం అనంతరం అమన్‌జోత్ మాట్లాడుతూ, "నా కుటుంబం, కోచ్‌లు, స్నేహితుల మద్దతు వల్లనే ఈ గెలుపు సాధ్యమైంది. అమ్మమ్మ ఆరోగ్యం బాగాలేక ఇంట్లో అందరూ మ్యాచ్ చూస్తున్నారని చెప్పింది.
Details
అమ్మమ్మకు ఈ గెలుపు ఎంతో ఆనందం ఇచ్చింది
ఆ సమయంలోనే ఆమె మాటల్లోని భావోద్వేగం, ఇంట్లో ఏదో సమస్య ఉందనే సంకేతం కనిపించింది. తరువాత ఆమెకు ఈ నిజం తెలియడంతో అమన్‌జోత్ కన్నీరు పెట్టుకుంది. ఆసుపత్రిలో ఉన్న అమ్మమ్మకు ఈ గెలుపు ఎంతో ఆనందం ఇచ్చిందని ఆమె తండ్రి తెలిపారు. ఒక క్రీడాకారిణి విజయం వెనుక ఆమె కృషి ఎంత ఉంటుందో, ఆ కృషికి పునాది వేస్తుంది కుటుంబం చేసే త్యాగం. అమన్‌జోత్ కథ కూడా అదే చెబుతోంది. భారత మహిళల ప్రపంచకప్ విజయానికి వెనుక ఇలాంటి ఎన్నో తెలియని భావోద్వేగాల కథలున్నాయి