LOADING...
Glenn Maxwell: మ్యాక్స్‌వెల్ ఎంపిక చేసిన ఆల్‌టైమ్ వన్డే జట్టు ఇదే.. భారత్ నుంచి ఆరుగురు! 
మ్యాక్స్‌వెల్ ఎంపిక చేసిన ఆల్‌టైమ్ వన్డే జట్టు ఇదే.. భారత్ నుంచి ఆరుగురు!

Glenn Maxwell: మ్యాక్స్‌వెల్ ఎంపిక చేసిన ఆల్‌టైమ్ వన్డే జట్టు ఇదే.. భారత్ నుంచి ఆరుగురు! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 15, 2025
04:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియా క్రికెట్ స్టార్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఇటీవల ఒక యూట్యూబ్ షోలో పాల్గొని, అద్భుతమైన ఆసక్తికరమైన ప్రకటన చేశాడు. ఈ కార్యక్రమంలో అతనికి ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లాండ్ దేశాల నుండి 'ఆల్‌టైమ్ ఎలెవెన్'ను ఎంపిక చేయమని అడిగారు. ఇందులో ఆసీస్‌ నుంచి ఐదుగురు ఆటగాళ్లకు మించి తీసుకోరాదని షరతు పెట్టాడు. మ్యాక్స్‌వెల్ తన జట్టులో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్‌ను ఎంపిక చేసాడు. ఆస్ట్రేలియా నుంచి ఆరుగురు ఆటగాళ్లు జట్టులో చేరగానే, చివరకు వార్నర్ స్థానానికి సచిన్ తెందూల్కర్‌ను ఎంపిక చేశాడు. మొత్తం జట్టులో భారత్‌ నుంచి ఆరుగురు ఆటగాళ్లకు చోటు దక్కింది.

Details

ఇంగ్లండ్ జట్టు నుంచి ఒకరు కూడా ఎంపిక కాలేదు

ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇంగ్లాండ్ నుంచి ఒక్కరు కూడా ఎంపిక కాలేదు. జో రూట్, ఇయాన్ మోర్గాన్, జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, ఆండ్రూ ఫ్లింటాఫ్, జేమ్స్ ఆండర్సన్ వంటి స్టార్ ఆటగాళ్లలో ఒక్కరినీ కూడా మ్యాక్స్‌వెల్ తన జట్టులోకి తీసుకోలేదు. ఇక ఆసీస్-భారత్ మూడు వన్డే సిరీస్ అక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానుందని తెలుసు. అయితే మ్యాక్స్‌వెల్ గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్ ముందు నెట్స్‌లో మ్యాక్స్‌వెల్ చేతికి గాయం లభించింది. తర్వాత శస్త్రచికిత్స కూడా చేశారు.

Details

మ్యాక్స్‌వెల్ చివరికి తన ఆల్‌టైమ్ జట్టుగా ఎంపిక చేసిన ఆటగాళ్లు:

సచిన్ తెందూల్కర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రికీ పాంటింగ్, మైకేల్ బెవన్ షేన్ వాట్సన్, ఎంఎస్ ధోనీ, బ్రెట్ లీ, అనిల్ కుంబ్లే, జస్‌ప్రీత్ బుమ్రా, గ్లెన్ మెక్‌గ్రాత్.