
Fastest Century in IPL: ఐపీఎల్ హిస్టరీలో ఫాస్టెస్ట్ సెంచరీ ఇదే..గేల్ రికార్డుకు మరోసారి గుర్తు!
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే బ్యాటర్ల మైదానం అని చెప్పవచ్చు. ప్రతి సీజన్‌లోనూ కొత్త కొత్త రికార్డులు నమోదవుతుంటే, కొన్ని గత రికార్డులను తిరగరాస్తుంటాయి.
ఇందులో ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న అంశం అత్యంత వేగవంతమైన సెంచరీలు చెప్పొచ్చు. ఐపీఎల్ చరిత్రలో కొన్ని ఇన్నింగ్స్‌లు అభిమానుల మనసుల్లో నిలిచిపోయేలా మారాయి.
క్రిస్ గేల్ బ్యాటింగ్‌ను మరచిపోలేం. అత్యంత వేగవంతమైన సెంచరీల పరంగా చూస్తే, ఇప్పటికీ ఆ క్రెడిట్ క్రిస్ గేల్‌కే దక్కింది.
2013లో పూణే వారియర్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడినప్పుడు గేల్ కేవలం 30బంతుల్లో సెంచరీ నమోదు చేశాడు.
అదే మ్యాచ్‌లో గేల్ 175 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇది టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నిలిచింది.
Details
37 బంతుల్లో యూసఫ్ పఠాన్ సెంచరీ
ఆ తర్వాత స్థానాల్లో భారత ఆటగాడు యూసుఫ్ పఠాన్ ఉన్నాడు. 2010లో రాజస్థాన్ రాయల్స్ తరపున ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు 37 బంతుల్లో శతకం బాది ఆకట్టుకున్నాడు.
ఈ సెంచరీ భారత ఆటగాడిగా చేసిన అత్యంత వేగవంతమైన సెంచరీగా నిలిచింది. డేవిడ్ మిల్లర్ 2013లో మొహాలీలో RCBపై 38 బంతుల్లో శతకం చేశాడు.
ఇటీవలే SRH తరపున ఆడుతున్న ట్రావిస్ హెడ్ 2024లో బెంగళూరులో 39 బంతుల్లో శతకం చేయగా, తాజాగా పంజాబ్ కింగ్స్ ప్లేయర్ ప్రియాంష్ ఆర్య అదే అంకెలో (39 బంతుల్లో) చెన్నై సూపర్ కింగ్స్‌పై సెంచరీ బాదాడు.
ఇది అతనికి రెండవ భారతీయుడిగా ఈ ఘనతను అందించింది.
Details
IPLలో అత్యంత వేగవంతమైన సెంచరీలు (బంతుల పరంగా)
30 బంతులు క్రిస్ గేల్ (RCB) vs PWI, బెంగళూరు, 2013
37 బంతులు - యూసుఫ్ పఠాన్ (RR) vs MI, ముంబై BS, 2010
38 బంతులు - డేవిడ్ మిల్లర్ (KXIP) vs RCB, మొహాలీ, 2013
39 బంతులు - ట్రావిస్ హెడ్ (SRH) vs RCB, బెంగళూరు, 2024
39 బంతులు - ప్రియాంష్ ఆర్య (PBKS) vs CSK, ముల్లాపూర్, 2025