Pakistans Richest Hindu: పాకిస్తాన్‌లో అత్యంత ధనవంతుడైన హిందువు ఇతనే.. దీపక్ పెర్వానీ ప్రొఫైల్ ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ లో ఇస్లాం తర్వాత హిందూ మతం రెండవ అతిపెద్ద మతంగా ఉంది. 2023 గణాంకాల ప్రకారం, ఆ దేశంలో సుమారు 52 లక్షల మంది హిందువులు నివసిస్తున్నారు. భారత్‌తో పోలిస్తే పాకిస్తాన్ చిన్న దేశం. ఆర్థిక వ్యవస్థ కూడా చిన్నదే. అక్కడ ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, శివ్ నాడార్, అజీమ్ ప్రేమ్‌జీ, నారాయణ మూర్తి వంటి బిలియనీర్ వ్యాపారవేత్తలు లేరు. అయితే పాకిస్తాన్‌లో కొందరు ధనవంతులు ఉన్నప్పటికీ, వారిలో హిందూ మైనారిటీకే చెందినవారు చాలా కొద్దిమంది మాత్రమే. పాకిస్తాన్‌లో అత్యంత ధనవంతుడైన హిందువు - దీపక్ పెర్వానీ పాకిస్తాన్‌లోని ధనవంతులైన హిందువుల్లో ప్రముఖమైన పేరు ఫ్యాషన్ డిజైనర్, నటుడు దీపక్ పెర్వానీ ది.
Details
ఎవరు దీపక్ పెర్వానీ?
1974లో సింధ్‌లోని మీర్పూర్ ఖాస్‌లో హిందూ కుటుంబంలో జన్మించిన దీపక్ పెర్వానీ, పాకిస్తాన్ ప్రముఖ నటుడు మరియు ఫ్యాషన్ డిజైనర్. ప్రపంచ ఫ్యాషన్ రంగంలో ఆయన ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. 1996లో DP - దీపక్ పెర్వానీ పేరుతో బ్రైడల్ & ఫార్మల్ వేర్ కోచర్ హౌస్‌ను ప్రారంభించారు. 2014 బల్గేరియన్ ఫ్యాషన్ అవార్డ్స్‌లో ఉత్తమ డిజైనర్ల జాబితాలో ఆరో స్థానంలో నిలిచారు. ఏడు లక్స్ స్టైల్ అవార్డులు, ఐదు BFA అవార్డులు, ఇండస్ స్టైల్ గురు అవార్డులు గెలుచుకున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద కుర్తాను డిజైన్ చేసినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఆయన పేరిట ఉంది.
Details
దీపక్ పెర్వానీ నికర సంపద
అంతేకాదు, భారతీయ గేయ రచయిత జావేద్ అక్తర్, నటి షబానా అజ్మీ వంటి ప్రముఖులకు కూడా దుస్తులను డిజైన్ చేశారు. చైనా, మలేషియా వంటి దేశాలకు పాకిస్తాన్ సాంస్కృతిక రాయబారిగా సేవలందించారు. సినీ రంగంలో కూడా ఆయన తనదైన గుర్తింపును పొందారు. సినిమాలు, టీవీ షోల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అధికారిక గణాంకాలు లేనప్పటికీ, 2022 మీడియా నివేదిక ప్రకారం ఆయన నికర విలువ దాదాపు రూ. 71 కోట్లు. దీంతో పాకిస్తాన్‌లో అత్యంత ధనవంతుడైన హిందువుల జాబితాలో అగ్రస్థానంలో నిలుస్తున్నారు.
Details
దీపక్ మాత్రమే కాదు… నవీన్ పెర్వానీ కూడా ధనవంతుడే
దీపక్ పెర్వానీ కజిన్ నవీన్ పెర్వానీ ప్రసిద్ధ స్నూకర్ ప్లేయర్. ఎన్నో అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఆయన నికర విలువ సుమారు రూ. 60 కోట్లుగా అంచనా. పాకిస్తాన్‌లో హిందువుల జనాభా పాకిస్తాన్‌లో మొత్తం హిందువులు: 52 లక్షలు ఇది మొత్తం జనాభాలో: 2.17% అత్యధికంగా హిందువులు నివసించే ప్రావిన్స్: సింధ్ (49,01,107 మంది) మొత్తం చూసుకుంటే, పాకిస్తాన్ హిందూ మైనారిటీలో అత్యంత ధనవంతుడిగా పేరుగాంచిన దీపక్ పెర్వానీ, ఫ్యాషన్ ప్రపంచంలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా ప్రత్యేక గుర్తింపును సంపాదించారు.