Abhishek Sharma: అభిషేక్ శర్మకు ఇదే సరైన టైమ్.. సూర్య వరల్డ్ రికార్డు బద్దలవుతుందా?
ఈ వార్తాకథనం ఏంటి
ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్ మరో చారిత్రక ఘట్టానికి వేదికయ్యే అవకాశం ఉంది. టీమిండియా విధ్వంసకర ఓపెనర్, 'కాటేరమ్మ కొడుకు' అభిషేక్ శర్మ తన బ్యాట్‌తో చెలరేగితే.. భారత టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు బద్దలయ్యే అవకాశం ఉంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యంత తక్కువ బంతుల్లో 2,000 పరుగులు పూర్తి చేసిన రికార్డు ప్రస్తుతం సూర్యకుమార్ పేరిట ఉంది. 2026లో భారత్‌ను టీ20 ప్రపంచకప్ విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించిన సూర్యకుమార్.. తన ఇన్నింగ్స్‌లో 1,164వ బంతికి ఈ మైలురాయిని చేరుకున్నాడు.
వివరాలు
రెండో స్థానంలో ఆరోన్ ఫించ్
ఈ జాబితాలో ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్ ఫించ్ 1,283 బంతులతో రెండో స్థానంలో ఉండగా, గ్లెన్ మాక్స్వెల్ 1,304 బంతులతో తర్వాతి స్థానంలో ఉన్నాడు.
అయితే నేటి మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఈ రికార్డును అధిగమించే అవకాశం ఉంది. కేవలం 2,000 పరుగుల రికార్డుపైనే కాకుండా.. ఒక క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక సిక్సర్లు బాదిన ఘనతపైనా అభిషేక్ శర్మ కన్నేశాడు.
2026లో ఇప్పటివరకు 31 మ్యాచ్‌లు ఆడిన అతను 63 సిక్సర్లు బాదాడు. ఫుల్ మెంబర్ దేశాల ఆటగాళ్లలో ఒకే క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డును అధిగమించాలంటే అభిషేక్ మరో ఆరు సిక్సర్లు సాధించాల్సి ఉంది.
ప్రస్తుతం ఈ రికార్డు కూడా సూర్యకుమార్ యాదవ్ పేరిటే ఉంది.
వివరాలు
వరల్డ్ రికార్డుపై కన్ను
2022లో 31 మ్యాచ్‌లు ఆడిన సూర్య.. ఏకంగా 68 సిక్సర్లు బాదాడు. దీంతో నేటి మ్యాచ్‌లో అభిషేక్ ఆరు సిక్సర్లు కొడితే ఈ రికార్డును తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉంటుంది.
అంతర్జాతీయ క్రికెట్‌లోనే కాకుండా.. ఈ ఏడాది ఓవరాల్ టీ20 మ్యాచ్‌ల్లోనూ అభిషేక్ శర్మ సిక్సర్లతో విధ్వంసం సృష్టిస్తున్నాడు. 2026లో వివిధ జట్ల తరఫున ఇప్పటివరకు 46 టీ20 మ్యాచ్‌లు ఆడిన అతను 106 సిక్సర్లు బాదాడు.
తన పేరిటే ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డును తానే అధిగమించేందుకు ఇప్పుడు కేవలం మూడు సిక్సర్ల దూరంలో ఉన్నాడు.
గత ఏడాది 2025లో భారత్, పంజాబ్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల తరఫున 41 మ్యాచ్‌లు ఆడిన అభిషేక్.. 108 సిక్సర్లు బాదాడు.
వివరాలు
మూడు సిక్సర్లు బాదితే రికార్డు బద్దలు
భారత బ్యాటర్లలో ఒక ఏడాదిలో సాధించిన అత్యధిక సిక్సర్ల ఘనత ఇదే కావడం విశేషం. తాజా మ్యాచ్‌లో మరో మూడు సిక్సర్లు బాదితే తన గత రికార్డును సమం చేస్తాడు.
అంతకుమించి బాదితే సరికొత్త రికార్డును నెలకొల్పుతాడు. ఇక నేటి మ్యాచ్‌లో అభిషేక్ శర్మతో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కూడా ఓ భారీ రికార్డుపై దృష్టి పెట్టాడు.
2026లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఇషాన్.. ఇప్పటివరకు 31 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 1,085 పరుగులు సాధించాడు.
నేటి మ్యాచ్‌లో కనీసం 80 పరుగులు చేస్తే.. ఒక క్యాలెండర్ ఏడాదిలో భారత్ తరఫున అత్యధిక టీ20 అంతర్జాతీయ పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచే అవకాశం ఉంది.
వివరాలు
అద్భుత ఫామ్ లో అభిషేక్ శర్మ
ప్రస్తుతం ఈ రికార్డు సూర్యకుమార్ యాదవ్ పేరిట ఉంది. 2022లో 31మ్యాచ్‌లు ఆడిన సూర్య.. 1,164 పరుగులు సాధించి ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
మరోవైపు అభిషేక్ శర్మ కూడా ఈ ఏడాది పరుగుల పరంగా అదరగొడుతున్నాడు. 2026లో ఇప్పటివరకు 31 మ్యాచ్‌లు ఆడిన అతను 852 పరుగులు సాధించాడు.
తద్వారా 2022లో 781పరుగులు చేసిన విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించాడు. అంతేకాకుండా, గత ఏడాది 2025లోనూ అభిషేక్ అద్భుత ప్రదర్శన చేశాడు.
ఆ ఏడాది 21 మ్యాచ్‌లు ఆడిన అతను 859 పరుగులు సాధించాడు.
మొత్తంగా నేటి మ్యాచ్‌లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ తమ బ్యాట్‌తో చెలరేగితే.. సూర్యకుమార్ యాదవ్ పేరిట ఉన్న పలు రికార్డులు బద్దలయ్యే అవకాశముంది.