
Asia Cup 2025: ఈసారి ఆసియా కప్‌ను సాధిస్తాం.. బంగ్లా బ్యాటర్ కీలక వ్యాఖ్యలు!
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈలో జరుగుతుంది. భారత్‌లో ఆతిథ్య హక్కులు ఉన్నప్పటికీ, పాకిస్థాన్‌తో పూర్వ ఒప్పందం కారణంగా ఈసారి టోర్నీ న్యూట్రల్ వేదికలో జరుగనుంది. సెప్టెంబర్ 9న అఫ్గానిస్థాన్-హాంకాంగ్ మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 11న బంగ్లాదేశ్ తన తొలి మ్యాచ్‌లో హాంకాంగ్‌ను ఎదుర్కొంటుంది. ఈ టోర్నీ కోసం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు 20 మంది ఆటగాళ్లతో ప్రిలిమినరీ జట్టును ప్రకటించింది. అంతేకాకుండా, యూఏఈలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి టైటిల్ లక్ష్యంగా బంగ్లాదేశ్ జట్టు శిక్షణకు సిద్ధమవుతోంది. బంగ్లాదేశ్ మిడ్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ జాకీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ... డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం సానుకూలంగా ఉంది.
Details
ఆసియా కప్ కోసం సిద్ధంగా ఉన్నాం
ఖచ్చితంగా ఈసారి ఛాంపియన్ అవ్వాలనే లక్ష్యంతో వెళ్తున్నాము. వ్యక్తిగతంగా నేను టోర్నీ గెలవడానికే వెళ్తున్నాను. డ్రెస్సింగ్ రూమ్‌లోని ప్రతి ఒక్కరూ ఈ విషయంపై నమ్మకంగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ కష్టపడి శిక్షణలో ఉంది. ఏ జట్టునైనా తేలికగా తీసుకోము. మా ప్రణాళిక ఎల్లప్పుడూ ఒకేలా ఉంటుంది. మేము మా స్వంత శైలిలో క్రికెట్ ఆడతాము. మైదానంలో బాగా రాణించగలిగేలా సిద్ధమవుతాము. ఈసారి ఆసియా కప్ మాది అనే నమ్మకం ఉందని తెలిపారు. 27 ఏళ్ల జాకీర్ అలీ ఇప్పటివరకు 33 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 571 పరుగులు సాధించి, సగటు 27.19తో కొనసాగుతున్నాడు. అతని అత్యధిక స్కోరు 72 నాటౌట్.
Details
బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ గా కెప్టెన్ లిట్టన్ దాస్
బంగ్లాదేశ్, శ్రీలంక, హాంకాంగ్, ఒమన్‌లతో గ్రూప్ Bలో ఉంది. సెప్టెంబర్ 9న అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో హాంకాంగ్‌తో బంగ్లాదేశ్ టైటిల్ వేటను ప్రారంభిస్తుంది. కెప్టెన్ లిట్టన్ దాస్ నాయకత్వంలో బంగ్లాదేశ్ జట్టు బరిలోకి దిగుతుంది. బంగ్లాదేశ్ ఇటీవల శ్రీలంక, పాకిస్థాన్‌లతో జరిగిన టీ20 సిరీస్‌లలో విజయం సాధించి మంచి ఫామ్‌లో ఉంది. టోర్నీ గ్రూప్ స్టేజ్, సూపర్ 4 అనంతరం ఫైనల్ ద్వారా ముగుస్తుంది.