LOADING...
Tilak Varma-CM Revanth: యువ క్రికెటర్ తిలక్ వర్మను అభినందించిన సీఎం రేవంత్‌రెడ్డి
యువ క్రికెటర్ తిలక్ వర్మను అభినందించిన సీఎం రేవంత్‌రెడ్డి

Tilak Varma-CM Revanth: యువ క్రికెటర్ తిలక్ వర్మను అభినందించిన సీఎం రేవంత్‌రెడ్డి

వ్రాసిన వారు Moogati Shabari
Mar 17, 2026
12:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్-2026 విజయం సాధించిన భారత జట్టులో హైదరాబాద్‌కు చెందిన యువ క్రికెటర్ తిలక్ వర్మ ఉండటం గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సోమవారం తన నివాసానికి తిలక్ వర్మను ఆహ్వానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు అజారుద్దీన్, వాకిటి శ్రీహరి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్ఎటీజీ) చైర్మన్ శివసేనారెడ్డి తదితర ప్రముఖులు హాజరయ్యారు.

వివరాలు

ప్రముఖుల సమక్షంలో సన్మానం

తిలక్ వర్మ సాధించిన విజయాన్ని రాష్ట్ర గర్వకారణంగా సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. తిలక్ వర్మ ప్రతిభ యువ క్రీడాకారులకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. హైదరాబాద్‌కు చెందిన తిలక్ వర్మ ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రిని కలవడం విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది.

Advertisement