Tilak Varma: అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అరుదైన మైలురాయిని చేరుకున్న తిలక్ వర్మ
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత మిడ్-ఆర్డర్ బ్యాట్స్‌మన్ తిలక్ వర్మ ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. టీమిండియా తరఫున టీ20లో వెయ్యి పరుగులు చేసిన ఆటగాళ్లలో తన స్థానం దక్కించుకున్నాడు. కటక్ వేదికగా మంగళవారం జరిగిన భారత-దక్షిణాఫ్రికా తొలి టీ20లో,4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఈ ఘనతను సాధించాడు. ఆ మ్యాచ్‌లో తిలక్ 32 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 26 రన్స్ సాధించాడు. ఇక భారత్ తరుపున టీ20 క్రికెట్‌లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న 12వ ఆటగాడిగా నిలిచాడు.
వివరాలు
భారత్ తరుపున టీ20ల్లో అత్యధిక వేగంగా 1000 పరుగులు సాధించిన ఆటగాళ్లు వీరే..
అంతేకాదు, భారత్ తరఫున వెయ్యి రన్స్ అత్యధిక వేగంగా సాధించిన ఆటగాళ్లలో ఐదో స్థానంలోనూ చోటు పొందాడు. 2023లో టీ20లో అంతర్జాతీయ అరంగ్రేటం చేసిన తిలక్ వర్మ ఇప్పటి వరకు 37 మ్యాచ్‌లు ఆడాడు. 34 ఇన్నింగ్స్‌లో సగటు 46.5తో 1022 రన్స్ సాధించాడు. ఈ రన్స్‌లో రెండు శతకాలు, నాలుగు అర్ధశతకాలు ఉన్నాయి. 1000 పరుగులు సాధించిన భారత్ ఆటగాళ్లు వీరే.. విరాట్ కోహ్లీ - 27 ఇన్నింగ్స్‌ల్లో అభిషేక్ శర్మ - 28 ఇన్నింగ్స్‌ల్లో కేఎల్ రాహుల్ - 29 ఇన్నింగ్స్‌ల్లో సూర్యకుమార్ యాదవ్ - 31 ఇన్నింగ్స్‌ల్లో తిలక్ వర్మ - 34 ఇన్నింగ్స్‌ల్లో
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బీసీసీఐ చేసిన ట్వీట్
𝗠𝗶𝗹𝗲𝘀𝘁𝗼𝗻𝗲 𝗨𝗻𝗹𝗼𝗰𝗸𝗲𝗱 🔓
— BCCI (@BCCI) December 9, 2025
1⃣0⃣0⃣0⃣ T20I runs and counting for the impressive Tilak Varma 👏
Updates ▶️ https://t.co/tiemfwcNPh #TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/L4wr701GCV