LOADING...
IND vs ENG : తిలక్ వర్మ విధ్వంసం.. ఇంగ్లండ్‌పై టీమిండియా గ్రాండ్ విక్టరీ

IND vs ENG : తిలక్ వర్మ విధ్వంసం.. ఇంగ్లండ్‌పై టీమిండియా గ్రాండ్ విక్టరీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 25, 2025
10:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య సెకండ్ టీ20 మ్యాచ్ చిదంబరం స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచులో భారత జట్టు 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో సిరీస్ 0-2తేడాతో ఆధిక్యంలో దూసుకెళ్లింది. మొదట టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుని ఇంగ్లండ్ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 165 పరుగులు చేసి, 9 వికెట్లు కోల్పోయింది. భారత్‌కు 166 పరుగుల లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ మ్యాచులో తిలక్ వర్మ (72) చివరి వరకూ క్రీజులో నిలబడి జట్టుకూ విజయాన్ని అందించారు. ఇక వాషింగ్టన్ సుందర్ 20 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.

Details

రెండు వికెట్లు తీసిన అక్షర్ పటేల్

చివర్లో రవి బిష్ణోణ్ రెండు ఫోర్లు కొట్టి భారత్ పై ఒత్తిడి తగ్గించాడు. మిగతా భారత బ్యాటర్లు విఫలమయ్యారు. ఈ మ్యాచులో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ అత్యధిక స్కోరు 30 బంతుల్లో 45 పరుగులు చేశాడు. జామీ స్మిత్ 22 పరుగులు, బ్రేడన్ కార్సే 31 పరుగులు సాధించారు. భారత్ బౌలర్లు అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలా 2 వికెట్లు పడగొట్టారు. అలాగే, అర్ష్‌దీప్‌ సింగ్‌, హార్దిక్‌ పాండ్యా, వాషింగ్టన్‌ సుందర్‌, అభిషేక్‌ శర్మ ఒక వికెట్ సాధించారు.