Tim David : సిక్సర్ల వర్షం కురిపించిన టిమ్ డేవిడ్.. కొడితే స్టేడియం బయటికి వెళ్లిన బంతి!
ఈ వార్తాకథనం ఏంటి
బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ 2026 సీజన్‌లో మరో స్మాషింగ్ ఇన్నింగ్స్‌ను అభిమానులు చూశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన 11వ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.
వివరాలు
సిక్సర్ల వర్షం కురిపించిన టిమ్ డేవిడ్
ఈ మ్యాచ్‌లో ప్రధాన హైలైట్ టిమ్ డేవిడ్ చెప్పొచ్చు. క్రీజులోకి అడుగుపెట్టిన వెంటనే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 25 బంతుల్లోనే 70 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఇందులో 3 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. 19వ ఓవర్‌లో జేమీ ఓవర్టన్ వేసిన బంతిని కొట్టిన డేవిడ్, అది స్టేడియం దాటి కబ్బన్ పార్క్‌లోకి వెళ్లిపోయింది. 280.00 స్ట్రైక్ రేట్‌తో ఆడిన డేవిడ్ చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించాడు.
వివరాలు
పడిక్కల్ - పాటిదార్ మెరుపులు
మొదట విరాట్ కోహ్లీ 28 (18) పరుగులకే అవుట్ అయ్యాడు. తర్వాత దేవదత్ పడిక్కల్ జట్టు కోసం బాధ్యతాయుతంగా ఆడాడు. 29 బంతుల్లో 50 పరుగులు చేసి స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత రజత్ పాటిదార్, డేవిడ్‌కు అద్భుతమైన సహకారం అందించాడు. 19 బంతుల్లో 48 పరుగులు నాటౌట్‌గా సాధించి, ఒక ఫోర్, 6 సిక్సర్లు బాదాడు. పడిక్కల్ - పాటిదార్ మధ్య 35 బంతుల్లో 99 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. ముఖ్యంగా చివరి 5ఓవర్లలో ఈ ఇద్దరు కలిసి 97 పరుగులు రాబట్టారు. ఆర్సీబీ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 250 పరుగులు సాధించింది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.