LOADING...
Sachin Tendulkar: క్రికెట‌ర్‌ను కాదు న‌టుడినని చెప్పి పన్ను మినహాయింపు పొందిన సచిన్ టెండూల్కర్
క్రికెట‌ర్‌ను కాదు న‌టుడినని చెప్పి పన్ను మినహాయింపు పొందిన సచిన్

Sachin Tendulkar: క్రికెట‌ర్‌ను కాదు న‌టుడినని చెప్పి పన్ను మినహాయింపు పొందిన సచిన్ టెండూల్కర్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 30, 2025
04:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆదాయపన్ను మినహాయింపు కోసం చేసిన ఆసక్తికరమైన వాదన మరోసారి చర్చనీయాంశమైంది. తాను కేవలం క్రికెటర్ మాత్రమే కాకుండా నటుడినని పేర్కొంటూ, ఆ ఆధారంగా పన్ను రాయితీ కోరినట్లు సమాచారం. సచిన్ వాదనను అంగీకరించిన ఆదాయపన్ను శాఖ ఆయనకు సుమారు ₹58 లక్షల ట్యాక్స్ మినహాయింపు మంజూరు చేసింది. ఈ అంశాన్ని ట్యాక్స్ నిపుణుడు సుజిత్ బంగర్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ ఘటన 2002-03 ఆర్థిక సంవత్సరానికి చెందినదని ఆయన తెలిపారు. ఆ కాలంలో సచిన్ విదేశీ బ్రాండ్లకు కమర్షియల్స్‌లో నటించి సుమారు ₹5.29 కోట్ల ఆదాయం పొందాడు. ఆయన ఈఎస్పీఎన్, పెప్సీ, వీసా వంటి ప్రముఖ కంపెనీల ప్రకటనల్లో కనిపించారు.

వివరాలు 

 ₹1.77 కోట్లకు పన్ను మినహాయింపు 

అయితే ఆ ఆదాయాన్ని ఆయన క్రికెట్ సంపాదనగా కాకుండా, నటుడిగా పొందిన ఆదాయంగా చూపించారు. ఈ క్రమంలో సెక్షన్ 80RR కింద లభించే పన్ను రాయితీ కోసం దరఖాస్తు చేశారు. ఈ చట్టం ప్రకారం నటులు, రచయితలు, కళాకారులు తమ విదేశీ ఆదాయంపై 30 శాతం వరకు మినహాయింపు పొందవచ్చు. సచిన్ కూడా దాని ప్రకారం సుమారు ₹1.77 కోట్లకు పన్ను మినహాయింపు ఇవ్వాలని అభ్యర్థించారు. ప్రారంభంలో ఆదాయపన్ను అధికారులు ఈ అభ్యర్థనను తిరస్కరించారు. వారి వాదన ప్రకారం, "క్రికెటర్లు సహజంగానే ప్రకటనల్లో కనిపిస్తారు; అది వారి వృత్తికి సంబంధించిన అదనపు ఆదాయమే గాని, 'యాక్టింగ్' వృత్తికి చెందినదిగా పరిగణించలేము, కాబట్టి 80RR నిబంధన వర్తించదు" అని పేర్కొన్నారు.

వివరాలు 

స‌చిన్‌కు 58 ల‌క్ష‌ల ప‌న్ను మిన‌హాయింపు

అయితే స‌చిన్ మాత్రం త‌న పంథా మార్చుకోలేదు. "నేను ఆ ప్రకటనల్లో మోడలింగ్ ,యాక్టింగ్ చేశాను; ఇది స్పష్టంగా నటుడి వృత్తి పరిధిలోకి వస్తుంది" అని ఆయన సమర్థించుకున్నారు. చివరికి ఆయన వివరణతో సంతృప్తి చెందిన పన్ను అధికారులు, కంపెనీ యాడ్‌ల‌కు న‌టించ‌డాన్ని యాక్టింగ్‌గా ప‌రిగ‌ణించారు. దీంతో స‌చిన్‌కు 58 ల‌క్ష‌ల ప‌న్ను మిన‌హాయింపు వ‌చ్చింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

'నేను నటుడిని': సచిన్