IND vs AUS: నేడు ఆసీస్‌తో కీలక పోరు.. టీమిండియా సిరీస్‌ను కైవసం చేసుకుంటుందా?
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఈరోజు చివరి (ఐదో) పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే భారత్ 3-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. కానీ ఓటమి ఎదురైతే సిరీస్ సమంగా ముగుస్తుంది. మరోవైపు ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా మాత్రం తీవ్ర ఒత్తిడిలో ఉంది. స్వదేశంలో సిరీస్ కోల్పోకూడదని కంగారూలు పట్టుదలగా ఉన్నారు. ఈ నేపథ్యంలో గాబా మైదానంలో మంచి బౌన్స్‌తో కూడిన పిచ్‌పై ఆసక్తికరమైన పోరు జరగనుంది. ఆస్ట్రేలియా పర్యటనకు ముందే భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఫామ్‌పై పెద్ద చర్చ నడిచింది. వన్డే, టీ20 ఫార్మాట్‌లలో గిల్ రన్ లేక ఇబ్బంది పడుతున్నాడు. గత 7 ఇన్నింగ్స్‌లలో ఒక్క అర్థశతకం కూడా సాధించలేకపోయాడు.
Details
సూర్యకుమార్ యాదవ్ ఫామ్ పై ఆందోళన
ఈ నేపథ్యంలో గిల్ తన ఫామ్‌ను తిరిగి సంపాదించాలనే ఉత్సాహంతో బరిలోకి దిగనున్నాడు. మరోవైపు అభిషేక్ శర్మ దూకుడుగా ఆడుతుండగా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ మాత్రం ఇంకా ఆందోళన కలిగిస్తోంది. గత 18 ఇన్నింగ్స్‌లలో సూర్య ఒక్కసారి కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోయాడు. తిలక్ వర్మ కూడా తనదైన శైలిలో మెరుస్తాడనే ఆశలు ఉన్నాయి. గత మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చూపి జట్టుకు విజయం అందించారు. కానీ బ్యాటింగ్‌లో వైఫల్యాలు స్పష్టంగా కనిపించాయి. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే ఇద్దరు విభాగాల్లోనూ సమర్థంగా రాణిస్తున్నారు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా ప్రత్యర్థి బ్యాటర్లకు సవాలుగా మారుతున్నాడు.
Details
అరుదైన రికార్డుకు చేరువలో బుమ్రా
వరుసగా రెండు విజయాలు అందుకున్న జట్టులో మార్పులు చేసే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. ఇక జస్ప్రీత్ బుమ్రా కెరీర్‌లో కీలక మైలురాయికి చేరువలో ఉన్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్ల మైలురాయికి ఆయన కేవలం ఒక వికెట్ దూరంలో ఉన్నాడు. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు విషయానికి వస్తే, ప్రధాన ఆటగాళ్లు హేజల్‌వుడ్, ట్రావిస్ హెడ్‌లు సిరీస్ మధ్యలో తప్పుకోవడంతో జట్టులో అస్థిరత నెలకొంది. ముఖ్యంగా హోబార్ట్, కరారాలో నెమ్మదైన పిచ్‌లపై ఆస్ట్రేలియా బ్యాటర్లు భారత స్పిన్నర్లను ఎదుర్కొవడంలో విఫలమయ్యారు. ఫలితంగా తక్కువ స్కోర్లకే పరిమితమై జట్టు పరాజయాలను చవిచూసింది.
Details
సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తున్న టీమిండియా
ఈసారి కనీసం సిరీస్‌ను డ్రా చేయాలని ఆసీస్ ప్రయత్నిస్తోంది. బ్యాటింగ్‌లో మిచెల్ మార్ష్ ఒక్కడే స్థిరంగా ఆడుతున్నాడు. టాప్-4లో షార్ట్, ఇన్‌గ్లిస్, టిమ్ డేవిడ్ రాణిస్తే భారీ స్కోరు సాధించడం కష్టంకాదు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఈ మ్యాచ్‌లో మెరుస్తాడేమో అన్న ఆసక్తి ఉంది. అయితే, బౌలింగ్ విభాగంలో అనుభవలేమి స్పష్టంగా కనిపిస్తోంది. భారత స్పిన్నర్లు అద్భుతంగా రాణిస్తుండగా, ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా ఎక్కువ రన్స్ ఇవ్వడం జట్టుకు తలనొప్పిగా మారింది. మరోవైపు వాతావరణం కూడా మ్యాచ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. గాబాలో స్వల్ప వర్షం ముప్పు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. అంటే ఈ సిరీస్ ఫలితాన్ని నిర్ణయించబోయే ఈ తుదిపోరు ఉత్కంఠభరితంగా సాగనుంది.