English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Expensive Cricket Bats: ప్రపంచ క్రికెట్​లో అత్యంత ఖరీదైన బ్యాట్​లు వాడే క్రికెటర్లు ఎవరో తెలుసా?
    తదుపరి వార్తా కథనం
    Expensive Cricket Bats: ప్రపంచ క్రికెట్​లో అత్యంత ఖరీదైన బ్యాట్​లు వాడే క్రికెటర్లు ఎవరో తెలుసా?
    ప్రపంచ క్రికెట్​లో అత్యంత ఖరీదైన బ్యాట్​లు వాడే క్రికెటర్లు ఎవరో తెలుసా?

    Expensive Cricket Bats: ప్రపంచ క్రికెట్​లో అత్యంత ఖరీదైన బ్యాట్​లు వాడే క్రికెటర్లు ఎవరో తెలుసా?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 07, 2024
    05:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు ఉన్న క్రేజ్ అంతా వేరు. క్రికెటర్ల గురించి ఏ విషయాన్నైనా అభిమానులు ఆసక్తిగా తెలుసుకోవాలని కోరుకుంటారు.

    ఈ క్రమంలో అత్యంత ఖరీదైన బ్యాట్లను వాడిన క్రికెటర్లు ఎవరు? అత్యంత ఎక్కువ ధర ఉన్న క్రికెట్ బ్యాట్‌ను వాడిన బ్యాటర్ ఎవరనే అంశాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

    వివియన్ రిచర్డ్స్: విండీస్ క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ ప్రపంచంలో అత్యంత ఖరీదైన బ్యాట్‌ను వాడారు. ఈ దిగ్గజ ఆటగాడు 'ది గ్రే నికోల్స్ లెజెండ్ గోల్డ్ బ్రాండ్' బ్యాట్ (Gray Nicolls Legend Bat) వాడారు. ఇంగ్లీష్ విల్లో కలపతో తయారుచేసిన ఈ బ్యాట్ ధర 14 వేల డాలర్లు. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.11.74 లక్షలు.

    వివరాలు 

    అత్యంత ఎక్కువ ధర ఉన్న క్రికెట్ బ్యాట్‌

    స్టీవ్ స్మిత్: ఆస్ట్రేలియా టాప్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ కూడా ఖరీదైన బ్యాట్‌ను వాడుతున్నారు. అతడు వాడే ఎన్ బీ (న్యూ బ్యాలెన్స్)బ్యాట్ ధర రూ.11 లక్షలు.

    హార్దిక్ పాండ్య: టీమిండియా హార్డ్ హిట్టర్, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య విలాసవంతమైన క్రికెటర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. పాండ్యకు విలాసవంతమైన కార్లు, బంగ్లాలు ఉన్నాయి. అంతేకాకుండా, అతడు వాడే బ్యాట్ కూడా ఖరీదైనది. ఈ ఆల్ రౌండర్ వాడే ఎస్ జీ(SG)బ్యాట్ ధర రూ.1,79,999.

    క్రిస్ గేల్: వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం, సిక్సర్ల వీరుడు క్రిస్ గేల్ స్పార్టన్ బ్రాండ్ బ్యాట్ (Spartan Cricket Kit) వాడుతాడు. ఈ బ్యాట్‌తో బంతిని సునాయాశంగా బౌండరీకి తరలిస్తాడు. ఈ బ్యాట్ ధర రూ.1 లక్ష.

    మీరు
    50%
    శాతం పూర్తి చేశారు

    వివరాలు 

    అత్యంత ఎక్కువ ధర ఉన్న క్రికెట్ బ్యాట్‌

    జాస్ బట్లర్: ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జాస్ బట్లర్ కూడా ఖరీదైన బ్యాట్‌ను వాడుతున్నాడు. అతడు వాడే కుకబురా (Kookaburra) బ్యాట్ ధర రూ.97 వేలు.

    డేవిడ్ వార్నర్: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ డీఎస్ సీ (Delux Sports Company) బ్యాట్ వాడుతాడు.దీని ధర రూ.95 వేలు.

    బెన్ స్టోక్స్:ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ జీఎం(Gun And More) బ్యాట్‌తో మైదానంలోకి దిగుతాడు. దాని ధర రూ.95 వేలు.

    సూర్య కుమార్ యాదవ్: టీమిండియా విధ్వంసకర ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ ఎస్ఎస్ (Sareen Sports) బ్యాట్ వాడుతున్నారు. దీని ధర రూ.92 వేలు.

    గార్డెనర్: ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ గార్డెనర్ రూ.91 వేల విలువైన బ్యాట్ వాడుతున్నారు.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    క్రికెట్

    తాజా

    Israel: ఖాన్ యూనిస్‌లోని యూరోపియన్ హాస్పిటల్ కింద హమాస్ గాజా చీఫ్ మృతదేహం లభ్యం ఇజ్రాయెల్
    Bonaalu: ఈ నెల 26 నుంచి హైదరాబాద్-సికింద్రాబాద్​ బోనాల పండుగ.. రూ.20 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం బోనాలు
    Earthquake: ప్రకాశం జిల్లాను వణికించిన భూకంపం.. నాలుగు సెకండ్లపాటు కంపించిన భూమి ప్రకాశం జిల్లా
    Kaleshwaram Commission: కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీమంత్రి హరీష్ రావు తెలంగాణ

    క్రికెట్

    Hong Kong Sixes Tournament: 'హాంకాంగ్ సిక్సెస్' టోర్నమెంట్ నవంబర్ 1 నుంచి.. రూల్స్ ఎలా ఉన్నాయంటే? హాంగ్ కాంగ్
    ICC Women T20 World Cup 2024: భారత జట్టు భారీ విజయాన్ని సాధించాలి భారత జట్టు
    IND vs BAN: రేపు హైదరాబాద్ లో బంగ్లాతో మూడో టీ20.. మరో తెలుగు ప్లేయర్‌కు ఛాన్స్!  క్రీడలు
    Ajay Jadeja: జామ్‌నగర్ రాజకుటుంబానికి అజయ్ జడేజా వారసుడు.. అధికారిక ప్రకటన విడుదల ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025