LOADING...
Ipl 2026: టాస్‌ గెలిస్తే చాలదు.. ముందు బౌలింగ్‌ తీసుకున్నవారికి షాక్‌.. ఇప్పుడు ఏం చేస్తారు?
టాస్‌ గెలిస్తే చాలదు.. ముందు బౌలింగ్‌ తీసుకున్నవారికి షాక్‌.. ఇప్పుడు ఏం చేస్తారు?

Ipl 2026: టాస్‌ గెలిస్తే చాలదు.. ముందు బౌలింగ్‌ తీసుకున్నవారికి షాక్‌.. ఇప్పుడు ఏం చేస్తారు?

వ్రాసిన వారు Moogati Shabari
May 29, 2026
02:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాస్‌ గెలవడం ఎంత కీలకమో, అలాగే సరైన నిర్ణయం తీసుకోవడమూ అంతే ముఖ్యమని ఐపీఎల్‌ 2026 సీజన్‌లో గత రెండు మ్యాచ్‌లే స్పష్టంగా చూపించాయి. ఈ రోజు రాత్రి 7.30 గంటలకు గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ నెగ్గే జట్టు ఏ నిర్ణయం తీసుకుంటుందన్నదే ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేపుతోంది. నాకౌట్‌ దశకు చేరిన నాలుగు జట్లలో ఇప్పటికే ఒక జట్టు పోటీలోంచి బయటకు వెళ్లిపోయింది. మిగిలిన మూడు జట్లు కప్‌ రేసులో కొనసాగుతున్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇప్పటికే ఫైనల్‌ బెర్త్‌ ఖాయం చేసుకుని సిద్ధంగా ఉంది.

వివరాలు

ఆర్సీబీ మ్యాచ్‌లో ఏం జరిగిందంటే..

ఇక రెండో ఫైనలిస్ట్‌ను నిర్ణయించే ఈ కీలక పోరుకు ముల్లాన్‌పుర్‌ వేదికగా మారనుంది. ఇక్కడ టాస్‌ గెలిచిన జట్టు తీసుకునే నిర్ణయమే మ్యాచ్‌ ఫలితాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉంది. ఎందుకంటే ప్లేఆఫ్స్‌లో జరిగిన గత రెండు మ్యాచ్‌ల్లోనూ టాస్‌ గెలిచిన జట్లే చివరికి ఓటమి పాలవడం గమనార్హం. తొలి క్వాలిఫయర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును గుజరాత్ టైటాన్స్ ఎదుర్కొంది. ఆర్సీబీ బ్యాటర్లు విరుచుకుపడి 250కి పైగా భారీ స్కోరు సాధించారు. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో గుజరాత్ బ్యాటింగ్ లైనప్‌ విఫలమై కేవలం 162 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో తొలుత బౌలింగ్‌ ఎంచుకోవడం పెద్ద తప్పిదంగా మారింది.

వివరాలు

ఆర్‌ఆర్‌ మ్యాచ్‌లో పరిస్థితి ఇదే..

బెంగళూరు-గుజరాత్ మ్యాచ్‌ చూశాక కూడా సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ అదే పొరపాటు చేసింది. ముల్లాన్‌పుర్‌లో టాస్‌ గెలిచిన వారు కూడా మొదట బౌలింగ్‌నే ఎంచుకున్నారు. దీంతో రాజస్థాన్ భారీగా 244 పరుగులు చేసింది. SRH గెలుస్తుందని చాలామంది భావించారు. కానీ కీలక సమయంలో వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టు ఓటమి పాలైంది. ఇక రెండో క్వాలిఫయర్ కూడా ముల్లాన్‌పుర్‌ వేదికగానే జరగనుంది. ఇది పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌గా భావిస్తున్నారు. అందువల్ల తొలుత బ్యాటింగ్ చేసే జట్టు కనీసం 230కి పైగా పరుగులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అంతకంటే తక్కువ స్కోరు చేస్తే ఓటమి తప్పదనే అభిప్రాయం ఉంది. గత రెండు మ్యాచ్‌ల్లోనూ 240కి పైగా స్కోరు చేసిన జట్లే విజయాన్ని అందుకున్నాయి.

Advertisement