
Cricketer Died: క్రీడా మైదానంలో విషాదం.. సిక్స్ కొట్టి గుండెపోటుతో మరణించిన యువకుడు
ఈ వార్తాకథనం ఏంటి
గుండెపోటు (Heart Attack) మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా, ఆరోగ్యంగా కనిపించే వారే సైతం హఠాత్తుగా హార్ట్ ఎటాక్ బారిన పడుతున్నారు. తాజాగా పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లా గురుహర్ సహాయ్ పట్టణంలో ఓ యువకుడు క్రికెట్ ఆడుతుండగానే కుప్పకూలిపోయి మృతిచెందిన ఘటన తీవ్ర విషాదానికి కారణమైంది. గ్రౌండ్‌లో ఎంతో ఉత్సాహంగా బ్యాటింగ్ చేస్తున్న హర్జీత్ సింగ్ అనే యువకుడు భారీ షాట్ కొట్టి పిచ్ మధ్యలోకి వచ్చిన క్షణాల్లోనే మోకాళ్లపై కూర్చుని, అకస్మాత్తుగా కిందపడ్డాడు. ఆటగాళ్లు వెంటనే స్పందించి CPR అందించగా, అనంతరం ఆసుపత్రికి తరలించారు.
Details
గుండె ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలి
అయితే అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటన DAV స్కూల్ మైదానంలో చోటుచేసుకుంది. యువకుడి మృతి పట్ల సహచరులు, కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైరల్‌గా మారిన వీడియోలో హర్జీత్ సింగ్ చివరిసారిగా షాట్ కొట్టి పరిగెత్తుతున్న దృశ్యాలు, అనంతరం కుప్పకూలుతున్న ఘట్టం భయానకంగా కనిపిస్తోంది. వ్యాయామం, క్రీడలు చేస్తున్నవారిలోనూ గుండె సంబంధిత సమస్యలు పెరిగిపోతుండటంతో ప్రజల్లో ఆందోళన విస్తరిస్తోంది. ఇలాంటి ఘటనలు గుండె ఆరోగ్యంపై మరింత అవగాహన పెంచుకోవాల్సిన అవసరాన్ని రుజువు చేస్తున్నాయి.