Page Loader
టెస్టులో ట్రావిస్ హెడ్ అద్భుత రికార్డు
59 బంతుల్లో 70 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్

టెస్టులో ట్రావిస్ హెడ్ అద్భుత రికార్డు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 05, 2023
01:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ టెస్టు మ్యాచ్ లో అద్భుతంగా రాణిస్తున్నారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో ట్రావిడ్ హెడ్ హఫ్ సెంచరీని పూర్తి చేశారు. ఇందులో 8 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. మొత్తం టెస్టులో 12 హాఫ్ సెంచరీలను నమోదు చేశాడు. కేవలం 59 బంతుల్లో 70 పరుగులు చేశారు. ఎప్పటిలాగే హెడ్ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 450 పరుగులను పూర్తి చేసింది. సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియా, సిడ్నీలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. హెడ్ ఐదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి దూకుడుగా ఆడాడు. నాలుగో వికెట్‌కు ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాతో కలిసి 112 పరుగులు జోడించాడు.

ట్రావిస్ హెడ్

ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో హెడ్ అద్భుత ఫామ్

తన 33వ టెస్టు ఆడుతున్న హెడ్.. ఇప్పుడు టెస్టులో 45.23 సగటుతో 2,126 పరుగులను సొంతం చేసుకున్నాడు. 12 అర్ధసెంచరీలతో పాటు, ఐదు సెంచరీలు చేశాడు. టెస్టులో అత్యధికంగా 175 పరుగులు చేశాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో హెడ్‌కి సిరీస్‌లో ఇది మూడో అర్ధశతకం కావడం విశేషం. ప్రస్తుతం జరుగుతున్న ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో హెడ్ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇందులో మూడు సెంచరీలు, అర్ధసెంచరీలు చేశాడు. 900 పరుగులు చేసిన అత్యధిక నలుగురు ఆసిస్ ఆటగాళ్ల లో హెడ్ కూడా ఒకడు.