
IND vs PAK: పాక్‌తో ఫైనల్‌కు ముందు ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు గాయం!
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్ 2025 ఫైనల్‌లో ఆదివారం భారత్ పాకిస్థాన్‌తో తలపడనుంది. అయితే జట్టులో ఇద్దరు కీలక క్రికెటర్లు గాయాలతో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. డేంజరస్ బ్యాటర్ అభిషేక్ శర్మ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య గాయాలైనట్లు వార్తలొస్తున్నాయి. సూపర్ 4 దశలో శ్రీలంకతో జరిగిన టీమిండియా చివరి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. అయితే ఆ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ శ్రీలంక ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్‌కి రాలేదు. హార్దిక్ పాండ్య కేవలం ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశారు. తొలి ఓవర్‌లోనే వికెట్ తీసి మళ్లీ బౌలింగ్‌కి రాలేదని, దీని కారణంగా అతడికి ఏమైనా గాయమో అనే చర్చలు ప్రారంభమయ్యాయి.
Details
ఆదివారం పాకిస్థాన్‌తో ఫైనల్ మ్యాచ్
ఆదివారం పాకిస్థాన్‌తో ఫైనల్ ఉండగా, ఇలాంటి సందర్భంలో వీరి గైర్హాజరీ జట్టుకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. అయినా బౌలింగ్ కోచ్ 'మోర్నీ మోర్కెల్' మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితి పెద్ద సమస్యకాదని వెల్లడించారు. హార్దిక్ పాండ్య దుబాయ్ వాతావరణం కారణంగా కండరాలు పట్టేయడం వల్ల మళ్లీ బౌలింగ్‌కి వెళ్లలేకపోయారని, ప్రస్తుతానికి పెద్ద గాయం లేదని చెప్పారు. అభిషేక్ శర్మ కూడా కేవలం క్రాంప్స్‌తో బాధపడ్డారని, ఫైనల్‌కి ఇద్దరు ఆటగాళ్లు అందుబాటులో ఉంటారని కోచ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఫైనల్ ముందు ప్రత్యేక ట్రైనింగ్ సెషన్ ఉండదని మోర్కెల్ పేర్కొన్నారు. కేవలం మసాజ్ సెషన్‌లు ఉంటాయి. ఆటగాళ్లకు రిలాక్స్ కావాల్సిన అవసరం ఉన్నందున, ఎక్కువ సాధన చేయడం మ్యాచ్ ప్రదర్శనపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు.