Page Loader
Team India: U19 ప్రపంచ కప్.. వెస్టిండీస్‌ను చిత్తు చేసిన భారత్
U19 ప్రపంచ కప్.. వెస్టిండీస్‌ను చిత్తు చేసిన భారత్

Team India: U19 ప్రపంచ కప్.. వెస్టిండీస్‌ను చిత్తు చేసిన భారత్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 19, 2025
02:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత అమ్మాయిలు తమ తొలి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో విజయాన్ని అందుకున్నారు. వెస్టిండీస్‌తో జరిగిన పోరులో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ జట్టు, భారత బౌలర్ల దాటికి నిలవలేక 13.2 ఓవర్లలోనే 44 పరుగులకే ఆలౌటైంది. ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం 4.2 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి సునాయాసంగా విజయాన్ని అందుకుంది. గొంగడి త్రిష (4) నిరాశపరిచినా, కమిలిని (16*), సానికా చాల్కే (18*) పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చారు.