LOADING...
Rishabh Pant: న్యూజిలాండ్ వన్డే జట్టులో పంత్ ఎంపికపై అనిశ్చితి.. ఆ ప్లేయర్‌కి అవకాశం
న్యూజిలాండ్ వన్డే జట్టులో పంత్ ఎంపికపై అనిశ్చితి.. ఆ ప్లేయర్‌కి అవకాశం

Rishabh Pant: న్యూజిలాండ్ వన్డే జట్టులో పంత్ ఎంపికపై అనిశ్చితి.. ఆ ప్లేయర్‌కి అవకాశం

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 28, 2025
11:03 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత జట్టు కొత్త సంవత్సరాన్ని న్యూజిలాండ్‌తో మూడు వన్డే సిరీస్‌తో ప్రారంభించనుంది. ఈ సిరీస్ జనవరి 11 నుంచి 18 వరకు జరుగనుంది. త్వరలోనే సెలక్టర్లు భారత వన్డే జట్టును ప్రకటించే అవకాశం ఉంది. వికెట్‌కీపర్-బ్యాటర్ రిషభ్ పంత్ జట్టులో చోటు దక్కే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు దేశవాళీ క్రికెట్‌లో చెలరేగుతున్న ఇషాన్ కిషన్‌ను వన్డే జట్టులోకి తీసుకునే అవకాశం ఎక్కువగా ఉందని వార్తలు వస్తున్నాయి. ఆగస్టు 2024లో పంత్ శ్రీలంకతో చివరి వన్డే ఆడాడు. ఇటీవల సఫారీ సిరీస్ కోసం అతడిని ఎంపిక చేసినప్పటికీ, ఒక్క మ్యాచ్‌లోనూ తుది జట్టులో చోటు దక్కలేదు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, సెలక్టర్లు కివీస్‌తో వన్డేలకు పంత్‌ను ఎంపిక చేయకూడదని నిర్ణయించారట.

Details

గిల్ జట్టులోకి చేరే అవకాశం

ఇషాన్ కిషన్ రెండేళ్ల క్రితం వన్డేలు ఆడిన తర్వాత జట్టుకు దూరమైనప్పటికీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT)లో టాప్ స్కోరర్‌గా నిలవడం, ఝార్ఖండ్ తొలిసారి SMAT టైటిల్‌ గెలిచేలో కీలకపాత్ర పోషించడం వల్ల అతడు మళ్లీ సెలక్టర్ల దృష్టిలోకి వచ్చాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో కిషన్ కర్ణాటకపై 33 బంతుల్లో శతకం బాదడం ద్వారా మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈ ప్రదర్శనల కారణంగా సెలక్షన్ కమిటీ ఇషాన్ కిషన్‌ను వన్డే జట్టులోకి తిరిగి తీసుకోవాలని భావిస్తోంది. మెడ నొప్పి కారణంగా సఫారీలతో వన్డే సిరీస్‌కి దూరమైన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తిరిగి జట్టులోకి చేరనున్నాడు.

Details

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ మ్యాచ్ షెడ్యూల్:

వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కివీస్‌తో వన్డేలకు అందుబాటులో ఉంటాడా, అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు, ప్రస్తుతానికి అతను బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉన్నాడు. తొలి వన్డే: జనవరి 11, వడోదర రెండో వన్డే: జనవరి 14, రాజ్‌కోట్ మూడో వన్డే: జనవరి 18, ఇందౌర్ ఈ సిరీస్ భారత వన్డే జట్టుకు కొత్త సంవత్సరంలో మంచి ప్రారంభం కావడానికి అవకాశమిస్తుంది.

Advertisement