WTC Points Table 2027 : పాకిస్తాన్-దక్షిణాఫ్రికా రెండో టెస్ట్: సిరీస్ సమం, WTC పాయింట్లలో మార్పులు
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో పాకిస్థాన్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ ఫలితంతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ 1-1తో సమం అయింది. ఈ ఓటమితో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ స్థానంలో తగ్గుదల కనిపించింది, మరోవైపు భారత్ స్థానం మెరుగయ్యింది. WTC 2025-27 సైకిల్‌లో భాగంగా దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ జట్లు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడాయి. మొదటి మ్యాచ్‌లో విజయం సాధించిన పాకిస్తాన్ అనూహ్యంగా పాయింట్ల పట్టికలో రెండో స్థానంలోకి చేరింది. అయితే, రెండో మ్యాచ్‌లో రావల్పిండీ వేదికలో ఓడిపోవడంతో WTC పాయింట్ల పట్టికలో రెండో స్థానంనుంచి ఐదో స్థానానికి పాకిస్తాన్ చేరింది.
వివరాలు
రెండో స్థానంలో భారత్
మరోవైపు, మొదటి మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ, రెండో టెస్టులో విజయాన్ని సాధించిన దక్షిణాఫ్రికా నాల్గో స్థానంలోకి వెళ్లింది. ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతూనే ఉంది. శ్రీలంక మూడో స్థానంనుంచి రెండో స్థానానికి, భారత్ నాల్గో స్థానంనుంచి మూడో స్థానానికి చేరుకుంది. ఇక ఆరో స్థానంలో ఇంగ్లాండ్, ఏడో స్థానంలో బంగ్లాదేశ్, ఎనిమిదో స్థానంలో వెస్టిండీస్ ఉన్నాయి. న్యూజిలాండ్ జట్టు ఇప్పటి వరకు WTC 2027 సైకిల్‌లో ఒకటే మ్యాచ్ ఆడింది. WTC పాయింట్ల కేటాయింపు విధానం: టెస్టు విజేత జట్టు: 12 పాయింట్లు మ్యాచ్ డ్రా: రెండు జట్లకు 4 పాయింట్లు టై అయినప్పుడు: 6 పాయింట్లు