ఉప్పల్ స్టేడియంలో నకిలీ టికెట్ల కుంభకోణం
ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా క్రికెట్ మ్యాచ్ లో ఫేక్ టికెట్లు వెలుగు చూశాయి. బీసీసీఐ ఇచ్చిన బార్ కోడ్ లను కాపీ చేస్తూ వందలాదిమంది అదే కార్డుల ద్వారా పంపిస్తూ మోసానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలుసుకున్న పేటీఎం సంస్థ, బీసీసీఐలు వెండర్స్ అక్రమాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రికెట్ స్టేడియంలో వెండర్స్ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తోందని, నకిలీ టికెట్లతో స్టేడియంలోకి వస్తున్నా హెచ్‌సీఏ అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. నకలీ టికెట్లను తయారు చేస్తున్న ఇఫోని ఈవెంట్ సంస్థపై కేసు నమోదు చేయాలని డిమాండ్ వినిపిస్తోంది.
నకిలీ టికెట్ల వ్యవహారంలో ఒకరు అరెస్టు
ఓ యువతి పేటిఎంలో పది టికెట్లను కొనుగోలు చేసింది. తమ సీట్లలో వేరే వారు ఉండటంతో ఈ ఫేక్ టికెట్ల బాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో ఒకరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. నకిలీ టికెట్ల వ్యవహారంపై హెచ్‌సీఏ అధికారులు కూడా చర్యలు చేపట్టాలని క్రికెట్ ఫ్యాన్స్ కోరుతున్నారు. ఉప్పల్ స్టేడియం వద్ద బ్లాక్ టికెట్ల దందా జరుగుతుందనే ఆరోపణలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. మ్యాచ్ సమయాల్లో స్టేడియం బయటే బ్లాక్ టికెట్లను యధేచ్ఛగా విక్రయిస్తున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు కూడా అధికారులు ఏం చేస్తున్నారో అర్ధం కావడం లేదు.