Vaibhav Suryavanshi: వైభవ్ ఆటను ఆకాశానికి ఎత్తిన సూర్య.. యువతరానికే కాదు ఆ తరానికి కూడా ఇన్ఫిరేషన్
ఈ వార్తాకథనం ఏంటి
వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు మరోసారి క్రికెట్ ప్రపంచంలో మార్మోగుతోంది. దోహాలో యూఏఈతో జరిగిన ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ 2026 మ్యాచ్‌లో భారత్-ఎ తరఫున ఆడిన ఈ టీనేజ్ బ్యాటర్ కేవలం 53 బంతుల్లో 204 పరుగులు చేసి సంచలన రికార్డు సృష్టించాడు. మొదటి బంతి నుంచే బౌలర్లపై విరుచుకుపడిన వైభవ్ కేవలం 28 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. దీంతో 2023లో జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ నెలకొల్పిన 29 బంతుల ఫాస్టెస్ట్ లిస్ట్-ఎ సెంచరీ రికార్డును తన పేరుతో మార్చేశాడు.
Details
40 బంతుల్లో 150.. 52 బంతుల్లో డబుల్ సెంచరీ
సెంచరీ తర్వాత వైభవ్ వేగం ఏమాత్రం తగ్గలేదు. కేవలం 40 బంతుల్లో 150 పరుగులు పూర్తి చేసి, గతంలో బిహార్ తరఫున తానే నెలకొల్పిన 59 బంతుల రికార్డును తానే బద్దలు కొట్టాడు.
ఆ తర్వాత వచ్చిన ఘట్టమే ఈ ఇన్నింగ్స్‌కు అసలు హైలైట్. కేవలం 52 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించి ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరిచాడు.
చివరకు 53 బంతుల్లో 7 ఫోర్లు, 28 సిక్సర్లతో 204 పరుగులు చేశాడు. ఒకే లిస్ట్-ఎ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డుగా ఉన్న డీఆర్సీ షార్ట్ 23 సిక్సర్ల మార్కును కూడా వైభవ్ దాటేశాడు.
Details
'ఇక నుంచి నువ్వే నా ఇన్‌స్పిరేషన్'.. సూర్య ప్రశంస
వైభవ్ ఆట చూసిన భారత టీ20 ప్రపంచకప్ విన్నింగ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఫిదా అయ్యాడు.
'ఇక నుంచి నువ్వే నా ఇన్‌స్పిరేషన్' అంటూ ఈ యువ బ్యాటర్‌ను ప్రశంసించాడు.
సురేశ్ రైనా, మహమ్మద్ కైఫ్, ఎస్. బద్రీనాథ్ కూడా వైభవ్ ఆటతీరును కొనియాడారు.
కైఫ్ చెప్పినట్టుగా.. రికార్డుల కోసం ఎదురుచూడకుండా వాటినే తన బ్యాట్‌తో రాస్తున్నట్టుగా వైభవ్ దూసుకెళ్తున్నాడు.
ఒక ఇన్నింగ్స్‌లో ఇన్ని రికార్డులు బద్దలు కావడం కంటే, ఇంత చిన్న వయసులో ఇలాంటి నిర్భయమైన బ్యాటింగ్ చేయడమే అతడి ప్రతిభకు అసలు నిదర్శనం.