
Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీకి జాక్‌పాట్.. బీహార్ జట్టులో వైస్ కెప్టెన్‌గా ఎంపిక!
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియాకు కొత్త సంచలనం అయిన వైభవ్ సూర్య వంశీ దూసుకుపోతున్నాడు. భారత అండర్-19 జట్టు తరఫున ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో తన ప్రత్యేక శైలిలో పరుగుల వరద పారించాడు. అతడి ప్రతిభపై మెచ్చిన బీహార్ క్రికెట్ అసోసియేషన్ భారీ అవకాశాన్ని ఇచ్చింది. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌కు అతడిని బీహార్ జట్టులోకి ఎంపిక చేయడమే కాకుండా, నేరుగా వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించింది. కాగా అరంగేట్ర మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ చేసిన సాకిబుల్ గనిని జట్టు కెప్టెన్‌గా నియమించారు.
Details
వైభవ్ గత రికార్డులు
ఇప్పటివరకు వైభవ్ సూర్యవంశీ బీహార్ తరఫున కేవలం 5 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లే ఆడాడు. 10 ఇన్నింగ్స్‌ల్లో అతడు 158 బంతులు ఎదుర్కొని కేవలం 100 పరుగులకే పరిమితమయ్యాడు. ఇలాంటి గణాంకాలున్నప్పటికీ అతడిని వైస్ కెప్టెన్‌గా నియమించడం చాలా మందికి ఆశ్చర్యంగా మారింది. ఐపీఎల్‌లో సంచలనం ఐపీఎల్ 2025 సీజన్‌లో అతడు రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడాడు. మెగా వేలంలో ఆర్ఆర్ రూ.1.1 కోట్లకు అతడిని తీసుకుంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండానే కేవలం 35 బంతుల్లో సెంచరీతో సంచలన ప్రదర్శన ఇచ్చి ఐపీఎల్ చరిత్రలో తన పేరును బంగారు అక్షరాలతో రాసేలా చేశాడు.
Details
బీహార్ జట్టు సభ్యులు
రంజీ సీజన్ కోసం బీహార్ జట్టు ఇలా ఉంది పీయూష్ కుమార్ సింగ్ ' భాష్కర్ దూబే సకీబుల్ గని (కెప్టెన్) వైభవ్ సూర్యవంశీ (వైస్ కెప్టెన్) అర్నవ్ కిషోర్ ఆయుష్ లోహరుక బిపిన్ సౌరభ్ అమోద్ యాదవ్ నవాజ్ ఖాన్ సాకిబ్ హుస్సేన్ రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ సచిన్ కుమార్ సింగ్ హిమాన్షు కుమార్ ఖలిద్