Page Loader
సంక్షిప్తం చేయు
ICC Rankings: వరుణ్ చక్రవర్తి సెన్సేషన్.. ర్యాంకింగ్స్‌లో టాప్-5లోకి దూసుకొచ్చిన స్పిన్నర్!
వరుణ్ చక్రవర్తి సెన్సేషన్.. ర్యాంకింగ్స్‌లో టాప్-5లోకి దూసుకొచ్చిన స్పిన్నర్!

ICC Rankings: వరుణ్ చక్రవర్తి సెన్సేషన్.. ర్యాంకింగ్స్‌లో టాప్-5లోకి దూసుకొచ్చిన స్పిన్నర్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 29, 2025
03:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో అతను ఆకట్టుకునే ప్రదర్శన చేస్తున్నాడు.

మంగళవారం ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో వరుణ్ 24 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు తీసి చెలరేగిపోయాడు. భారత్‌ ఓటమిపాలైనప్పటికీ అతను మ్యాన్ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

ఈ అద్భుత ప్రదర్శనతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంకు సాధించాడు. వరుణ్ ఏకంగా 25 స్థానాలు ఎగబాకి ఐదో స్థానాన్ని దక్కించుకున్నాడు.

ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ ఒక స్థానం మెరుగుపరుచుకుని తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

Details

9వ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్

ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ 13 స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంక్‌లో నిలిచాడు. భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తొమ్మిదో ర్యాంక్‌ను దక్కించుకోగా, రవి బిష్ణోయ్ ఐదు స్థానాలు కోల్పోయి 10వ ర్యాంక్‌కు పడిపోయాడు.

అక్షర్ పటేల్ ఐదు స్థానాలు మెరుగుపరుచుకుని 11వ ర్యాంకును సాధించాడు.

ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. తిలక్ వర్మ ఒక స్థానం మెరుగుపరచుకుని ఫిల్ సాల్ట్‌ను వెనక్కు నెట్టి రెండో ర్యాంక్‌లోకి చేరాడు.

సూర్యకుమార్ యాదవ్, జోస్ బట్లర్ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు.

Details

ఐసీసీ టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్ టాప్-5 

1. ఆదిల్ రషీద్ - 718 రేటింగ్ పాయింట్లు

2. అకీల్ హోస్సేన్ - 707 రేటింగ్ పాయింట్లు

3. వానిందు హసరంగ - 698 రేటింగ్ పాయింట్లు

4. ఆడమ్ జంపా - 694 రేటింగ్ పాయింట్లు

5. వరుణ్ చక్రవర్తి - 679 రేటింగ్ పాయింట్లు