Venus Williams: ఐదేళ్ల తర్వాత మైదానంలో.. వీనస్ విలియమ్స్ ఆస్ట్రేలియా ఓపెన్ రీ-ఎంట్రీ
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా వెటరన్ స్టార్ వీనస్ విలియమ్స్ ఐదేళ్ల తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్‌లో పునరాగమనం చేస్తున్నారు. జనవరిలో మెల్‌బోర్న్‌లో ప్రారంభం కానున్న ఈ టోర్నీకి ఆమెకు ఇప్పటికే వైల్డ్‌కార్డ్ ఎంట్రీ లభించింది. ఏడు సార్లు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ ఛాంపియన్‌గా నిలిచిన వీనస్, ఇటీవల డెన్మార్క్ మోడల్, యాక్టర్ ఆండ్రియా ప్రెటినితో వివాహబంధంలోకి అడుగుపెట్టారు.
Details
ఓపెన్ హైలైట్స్
ఆస్ట్రేలియన్ ఓపెన్ జనవరి 18న ప్రారంభమవుతుంది. 46 ఏళ్ల వయసులో మెయిన్ డ్రాలో తలపడనున్న పెద్ద వయస్కురాలిగా వీనస్ గుర్తింపు పొందుతున్నారు. ఈ రికార్డు గతంలో జపాన్‌కు చెందిన కిమికో డేట్ దగ్గర ఉంది. వీనస్ మాట్లాడుతూ ఆస్ట్రేలియా ఓపెన్‌లో తిరిగి ఆడటం సంతోషంగా ఉంది. ఇక్కడ నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని తెలిపారు. వీనస్ 1998లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తన అరంగేట్రం చేశారు. ఈ టోర్నీలో రెండుసార్లు సింగిల్స్ ఫైనల్‌కు చేరారు. 2003, 2017లో ఆమె చెల్లెలు సెరెనా విలియమ్స్ చేతిలో ఓడి, రన్నరప్‌గా నిలిచారు. 46 ఏళ్లా కూడా సత్తా చాటే వీనస్ తిరిగి మెయిన్ డ్రాలో పాల్గొనడం, ఫ్యాన్స్ కోసం పెద్ద సర్ప్రైజ్‌గా నిలిచింది.