P. V. Sindhu: చాలా భయపడ్డా.. దుబాయ్ ఘటనపై పివి.సింధు భావోద్వేగ స్పందన
ఈ వార్తాకథనం ఏంటి
పివి.సింధు దుబాయ్‌లో ఎదుర్కొన్న ఉద్రిక్త పరిస్థితులను వెల్లడించింది. దుబాయ్ ఎయిర్ పోర్టు సమీపంలో జరిగిన పేలుడు తమను తీవ్ర భయాందోళనకు గురి చేసిందని తెలిపింది. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు ఇంగ్లండ్‌కు ప్రయాణించే క్రమంలో ఆమె దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ యూఏఈ సహా గల్ఫ్ ప్రాంతాల్లోని పలు ప్రాంతాలపై దాడులు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో గగనతలాన్ని మూసివేయడంతో అనేక విమాన సర్వీసులు రద్దయ్యాయి.
Details
పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు ఇక్కడే ఉంటాం
ఈ పరిణామాలపై సింధు స్పందిస్తూ, "దుబాయ్‌లో మా విమానం దిగిన వెంటనే మా నియంత్రణలో లేని పరిస్థితులు మొదలయ్యాయి. మా పైన మిసైళ్లను అడ్డుకుంటున్న శబ్దాలు స్పష్టంగా వినిపించాయి. కొన్ని గంటల తర్వాత మేమున్న ప్రాంతానికి సమీపంలోనే భారీ పేలుడు జరిగింది. ఆ సమయంలో నా కోచ్ ఆ ప్రదేశానికి కేవలం 100 మీటర్ల దూరంలో ఉన్నారు. మేం వెంటనే అక్కడి నుంచి దూరమయ్యాం. అంత సమీపంలో ఇలాంటి ఘటనను చూడడం నిజంగా భయాన్ని కలిగించిందని పేర్కొంది. ప్రస్తుతం తాము హోటల్‌లోనే ఉన్నామని, సురక్షితంగానే ఉన్నప్పటికీ ఆందోళన మాత్రం ఉందని ఆమె కోచ్ ప్రతమ తెలిపారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు అక్కడే వేచి ఉండాల్సి వస్తోందని చెప్పారు.