VIDEO: పాకిస్థాన్ ఆటగాడు స్టంపౌట్.. నవ్వుకున్న నెటిజన్లు
విటాలిటీ టీ20 బ్లాస్ట్ టోర్నీలో పాకిస్థాన్ ఆటగాడు విచిత్రంగా స్టంపౌట్ అయ్యాడు. డెర్బిషైర్ తరుపున ఆడుతున్న పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ హైదర్ అలీ స్టంపౌట్ అయిన వీడియోను చూసిన నెటిజన్లు పడి పడి నవ్వుకుంటున్నారు. డెర్బిషైర్, బర్మింగ్ హామ్ మధ్య జరిగిన ఈ మ్యాచులో ఈ ఘటన చోటు చేసుకుంది. హైదర్ అలీ స్టంపౌట్ అయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. మొదట బ్యాటింగ్ చేసిన బర్మింగ్ హామ్ 203 పరుగులు చేసింది. లక్ష్య చేధనలో డెర్బీషైర్ బ్యాటర్ హైదర్ అలీ 11 ఓవర్లలో స్టంపౌట్ అయ్యాడు.
షాక్ కు గురైన డెర్బిషైర్ బ్యాటర్ హైదర్ అలీ
స్పిన్నర్ బ్రిగ్స్ వేసిన ఫుల్ లెన్త్ బంతిని కొట్టడానికి క్రీజులో నుంచి హైదర్ అలీ బయటికొచ్చాడు. అయితే ఆ బాల్ మిస్ అయి కీపర్ అలెక్స్ చేతిలో పడింది. గ్లవ్‌తో సరిగా బంతిని పట్టుకోలేకపోయిన అలెక్స్ రెండో ప్రయత్నంలో పట్టుకున్నాడు. ఆలోగా క్రీజులోకి వచ్చిన హైదర్.. బంతి కీపర్ చేతిలో ఉందని గమనించలేకపోయి పరుగు తీసేందుకు మళ్లీ క్రీజు దాటాడు. ఆ సమయంలో కీపర్ అతన్ని స్టంపౌట్ చేశాడు. దీంతో షాకైనా హైదర్ లీ 48 పరుగులు చేసి పెవిలియానికి చేరాడు. ఈ వీడియోను విటాలిటీ బ్లాస్ట్ ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అయింది. దీన్ని చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.