Vijay Hazare Trophy: విజయ్ హజారే ట్రోఫీ.. అరుణాచల్ ప్రదేశ్‌ను చిత్తుచేసిన హైదరాబాద్
ఈ వార్తాకథనం ఏంటి
విజయ్ హజారే ట్రోఫీ 2024-25 సీజన్‌లో హైదరాబాద్ తన నాలుగో విజయాన్ని సాధించింది.
ఆదివారం అహ్మదాబాద్‌లోని ఎడీఎస్‌ఎ రైల్వేస్ క్రికెట్ మైదానంలో జరిగిన ఏడో రౌండ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో అరుణాచల్ ప్రదేశ్‌ను చిత్తు చేసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన అరుణాచల్ ప్రదేశ్ 28.3 ఓవర్లలో కేవలం 96 పరుగులకే ఆలౌటైంది.
హైదరాబాద్ బౌలర్లు తనయ్ త్యాగరాజన్ (5/32), అనికేత్ రెడ్డి (4/14) చెలరేగడంతో ప్రత్యర్థి జట్టు తక్కువ స్కోరుకే కుప్పకూలింది.
అరుణాచల్ తరఫున సిద్ధార్థ్ బలోడి (29) అత్యధిక పరుగులు చేశారు.
Details
12 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించిన హైదరాబాద్
ధ్రువ్ సోని (20), బికి కుమార్ (15) పరుగులతో కొంత సహకారం అందించారు.
96 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని హైదరాబాద్ జట్టు కేవలం 12 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.
ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్ (22), కె నితీశ్ రెడ్డి (15) మంచి ఆరంభం అందించగా, పి నితీశ్ రెడ్డి (29*), కొడిమెల హిమతేజ (21*) నాటౌట్‌గా నిలిచారు.
ఈ విజయంతో హైదరాబాద్ సీజన్‌లో చక్కటి ఫామ్ కొనసాగించింది.