Vinod Kambli: ఆసుపత్రిలో వినోద్ కాంబ్లి.. 'చక్ దే ఇండియా' పాటకు డ్యాన్స్
ఈ వార్తాకథనం ఏంటి
భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లి అనారోగ్యంతో పది రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. మూత్రనాళాల ఇన్‌ఫెక్షన్‌తో ఆసుపత్రిలో చేరిన కాంబ్లి, వైద్య పరీక్షల్లో అతడి మెదడులో రక్తం గడ్డకట్టినట్టు తేలింది.
ప్రస్తుతం థానే జిల్లాలోని కల్హర్ వేదికగా ఉన్న ఆకృతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ క్రమంగా అనారోగ్యం నుంచి బయటపడుతున్నాడు.
ఈ క్రమంలో, కాంబ్లి తన ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచుకుంటూ హాస్పిటల్ గదిలో హిందీ పాట అయిన 'చక్ దే ఇండియా' పాటకు డ్యాన్స్ చేయడం ద్వారా సంతోషం పంచారు.
Details
డాక్టర్లతో కలిసి డ్యాన్స్
అతడు అక్కడి సిబ్బందితో కలిసి ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది కాంబ్లి తన ఆరోగ్యంపై ఇటీవలే మాట్లాడారు.
వైద్యుల వల్ల తాను బతికి ఉన్నానని చెప్తూ, 'ఇక్కడి డాక్టర్ల వల్లనే తాను బతికి ఉన్నానని హాస్పిటల్ బెడ్ మీద నుంచి స్టేట్‌మెంట్ ఇచ్చారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో
Vinod Kambli danced in the hospital😀 #VinodKambli pic.twitter.com/uYxnZMbY1u
— Cricket Skyblogs.in (@SkyblogsI) December 31, 2024