#Viral Moment : 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. చెన్నై యువ ఆటగాడి సంచలన బ్యాటింగ్
ఈ వార్తాకథనం ఏంటి
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 202 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఆ తర్వాత ఛేదన ప్రారంభించిన చెన్నైకి తొలి వికెట్‌గా సంజు శాంసన్ అవుట్ కావడంతో ఉర్విల్ పటేల్ క్రీజులోకి వచ్చాడు. వచ్చిన వెంటనే అతడు దూకుడైన ఆటతో లక్నో బౌలర్లపై ఎదురుదాడి ప్రారంభించాడు. పవర్‌ప్లే ముగిసే సమయానికి చెన్నై స్కోరు ఒక వికెట్ నష్టానికి 97 పరుగులకు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. 384.62 స్ట్రైక్‌రేట్‌తో ఆడిన ఉర్విల్ పటేల్, ప్రత్యర్థి బౌలర్ల ధైర్యాన్ని పూర్తిగా దెబ్బతీశాడు. తన ఇన్నింగ్స్‌లో 7 భారీ సిక్సర్లు, ఒక బౌండరీ నమోదు చేశాడు.
వివరాలు
జైస్వాల్ రికార్డుకు సమానం.. డివిలియర్స్ రికార్డుకు చెక్
ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో ఉర్విల్ పటేల్ అనేక రికార్డులను సమం చేస్తూ కొత్త మైలురాళ్లు సృష్టించాడు. గతంలో యశస్వి జైస్వాల్ నెలకొల్పిన 13 బంతుల్లో అర్థశతకం రికార్డును అతడు సమం చేశాడు. అదేవిధంగా, కేవలం 10 బంతుల్లోనే 42 పరుగులు సాధించి, 2015లో ముంబైపై ఏబీ డివిలియర్స్ నమోదు చేసిన 41 పరుగుల రికార్డును అధిగమించాడు. ఉర్విల్ సిక్సర్ల వర్షం కురిపించడంతో లక్నో ఫీల్డర్లు చూస్తూ ఉండిపోయారు.
వివరాలు
తండ్రికి అంకితమైన అర్థశతకం
హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అనంతరం ఉర్విల్ పటేల్ తన జేబులో నుంచి ఒక చిన్న కాగితం తీసి ప్రేక్షకులకు చూపించాడు. ఆ కాగితంపై "ఇది మీ కోసమే నాన్న" అని రాసి ఉండటం అభిమానులను భావోద్వేగానికి గురిచేసింది. తన తండ్రికి ఈ ప్రత్యేక ఇన్నింగ్స్‌ను అంకితం చేస్తూ అతడు చేసిన సెలబ్రేషన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఐదో ఓవర్‌లో ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాదిన ఉర్విల్ పటేల్ తన విధ్వంసకర ఆటకు శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత దిగ్వేష్ రాఠీ వేసిన ఓవర్‌లో కూడా రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో మరోసారి దాడి కొనసాగించాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వీడియో వైరల్..
🚨 Urvil Patel has now matched Yashasvi Jaiswal’s record for the fastest fifty in IPL history, 50 off just 13 balls 🥶
— Shehzade (@Shehzade_18) May 10, 2026
Absolute carnage from Urvil tonight 💛#IPL2026 #UrvilPatel #CSKvsLSG #Iplpic.twitter.com/h1ewsKqmk7