Page Loader
Virat Kohli: తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లీ.. రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న అనుష్క 

Virat Kohli: తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లీ.. రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న అనుష్క 

వ్రాసిన వారు Stalin
Feb 03, 2024
06:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

కింగ్ విరాట్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఫ్యాన్స్‌కు ఏబీ డివిలియర్స్ శుభవార్త చెప్పారు. విరాట్ దంపతులు రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు డివిలియర్స్ ప్రకటించారు. ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌ల నుంచి విరాట్ కోహ్లీ వైదొలగడానికి గల కారణాన్ని వివరిస్తూ.. ఏబీ డివిలియర్స్ ఈ విషయాన్ని వెల్లడించారు. తన యూట్యూబ్ ఛానెల్‌లో లైవ్‌లో మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ తమ రెండో బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారని డివిలియర్స్ ధృవీకరించారు. తన యూట్యూబ్ ఛానెల్‌లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఏబీ డివిలియర్స్ ఈ సమాధానమిస్తున్నాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

లైవ్‌లో మాట్లాడుతున్న డివిలియర్స్