
Virushka: బృందావనాన్ని సందర్శించిన కోహ్లి దంపతులు.. అనుష్క శర్మ-కోహ్లి జంటను ఆశీర్వదించిన ప్రేమానంద్ జీ
ఈ వార్తాకథనం ఏంటి
విరాట్ కోహ్లీ తన టెస్టు క్రికెట్ ప్రయాణానికి ముగింపు పలికాడు. సోమవారం రోజున అతను టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైరయ్యానని అధికారికంగా ప్రకటించాడు.
ఈ ప్రకటనతో పాటు అతని 14 సంవత్సరాల టెస్టు కెరీర్ ముగిసినట్టయింది.
ఇదివరకు టీ20 వరల్డ్‌కప్‌ను భారత్ గెలిచిన అనంతరం కోహ్లీ, ఈ పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకున్న విషయమూ అందరికీ తెలిసిందే.
ఇకపై అతడు కేవలం వన్డే క్రికెట్‌కే పరిమితమవుతాడు.
వివరాలు
సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలు
కోహ్లీ టెస్టు క్రికెట్‌కు రిటైరైన మరుసటి రోజే, అతడు తన భార్య అనుష్క శర్మతో కలిసి ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లాడు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బృందావన్ ధామ్‌లోని ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించిన ఈ జంట, అక్కడ ఆశీస్సులు పొందారు.
ఇదే ఆశ్రమాన్ని వారు గతంలో కూడా అనేకసార్లు సందర్శించారు. టెస్టు నుంచి విరమణ అనంతరం కోహ్లీ హాజరైన మొదటి వ్యక్తిగత కార్యక్రమం ఇదే కావడం విశేషం.
ఈ సందర్భంగా అక్కడ తీసిన ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అభిమానులు వాటిని ఎంతో ఉత్సాహంగా షేర్ చేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రేమానంద్ జీ ఆశ్రమంలో కోహ్లి దంపతులు
Virat Kohli & Anushka Sharma से पूज्य महाराज जी की क्या वार्तालाप हुई ? Bhajan Marg pic.twitter.com/7IWWjIfJHB
— Bhajan Marg (@RadhaKeliKunj) May 13, 2025